ఫ్యూచ‌ర్ సిటీకి కొత్త దారి!

Telangana is developing a new 8-km, two-lane road costing around ₹30 crore to improve connectivity to Bharat Future City.

Oct 4, 2026 - 12:50
 0  22
ఫ్యూచ‌ర్ సిటీకి కొత్త దారి!
future-city-new-8-km-road-ratan-tata-radial-road-connectivity
ఫ్యూచర్ సిటీకి మరో కొత్త రహదారి
సాగర్ హైవే నుంచి తక్కెళ్లపల్లి మీదుగా కొత్త మార్గం
రూ.30 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం
 
*
తక్కెళ్లపల్లి నుంచి కుర్మిద్ద, తాటిపర్తి మీదుగా రోడ్డు
 
ప‌ది బహుళజాతి కంపెనీలకు
వెయ్యి ఎకరాల భూముల కేటాయింపు
 
భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రి రవాణాకు ప్రత్యేక మార్గం
 
*
తుక్కుగూడ–మీర్‌ఖాన్‌పేట రోడ్డుపై
ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేలా చర్యలు
 
రతన్ టాటా రేడియల్ రోడ్డుతో
అనుసంధానానికి ప్రణాళిక
 
ఫ్యూచర్ సిటీ నుంచి ఓఆర్ఆర్‌, ట్రిపుల్ ఆర్‌
వైపు మెరుగుపడనున్న కనెక్టివిటీ
ఫ్యూచర్ సిటీకి మరో కొత్త దారి సిద్ధమవుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీని మరింత పెంచేలా ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. సాగర్ హైవే నుంచి తక్కెళ్లపల్లి మీదుగా కొత్త రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
30 కోట్ల ఖర్చుతో 8 కిలోమీటర్ల రోడ్డు..10 బహుళజాతి కంపెనీలకు వెయ్యి ఎకరాల భూములు.. భారీ వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గం.. మరి ఈ కొత్త రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఫ్యూచర్ సిటీకి ఎలా ఉపయోగపడుతుంది? రతన్ టాటా రేడియల్ రోడ్డుతో అనుసంధానం ఎలా ఉండబోతోంది?
 
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి మరో కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవే నుంచి తక్కెళ్లపల్లి మీదుగా ఫ్యూచర్ సిటీకి చేరుకునేందుకు కొత్త మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సుమారు 30 కోట్ల అంచనా వ్యయంతో 8 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు.
ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే ఫ్యూచర్ సిటీకి రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. తక్కెళ్లపల్లి ప్రాంతంలో ప‌ది బహుళజాతి సంస్థలకు సుమారు వెయ్యి ఎకరాల భూమిని కేటాయించారు. ఈ సంస్థలకు అవసరమైన భారీ యంత్రాలు, నిర్మాణ సామగ్రి రవాణా కోసం ప్రత్యేక రహదారి అవసరమైంది.
దీంతో కంపెనీల విజ్ఞప్తుల మేరకు అధికారులు కొత్త రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. తక్కెళ్లపల్లి నుంచి కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాల మీదుగా 8 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును రెండు వరుసల రహదారిగా విస్తరిస్తున్నారు.
 
ప్రస్తుతం భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లేందుకు తుక్కుగూడ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఉన్న రహదారి ప్రధాన మార్గంగా ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు, పారిశ్రామిక సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో భారీ వాహనాల రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. యంత్రాలు, నిర్మాణ సామగ్రిని తరలించే వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 
కొత్త రహదారి అందుబాటులోకి వస్తే పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రస్తుతం ఉన్న మార్గంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఫ్యూచర్ సిటీకి రహదారి కనెక్టివిటీని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తోంది. తక్కెళ్లపల్లి మార్గాన్ని భవిష్యత్తులో రతన్ టాటా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో అనుసంధానించాలన్నది ప్రణాళికగా ఉంది.
ఈ అనుసంధానం పూర్తయితే ఫ్యూచర్ సిటీ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వైపు.. కొంగరకలాన్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రావచ్చు. దీంతో దక్షిణ హైదరాబాద్‌లో రహదారుల అనుసంధానం మరింత మెరుగుపడే అవకాశం ఉంది..! భారత్ ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నెట్‌జీరో నగరంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
 
ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. 2026 జూన్‌లో ఈ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. పారిశ్రామిక, వాణిజ్య, విద్యా, సాంకేతిక రంగాలకు అనువైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. కొత్త రహదారులు.. భారీ పరిశ్రమలు.. అంతర్జాతీయ స్థాయి నగరం.. ఈ మూడు అంశాలతో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.
మొత్తంగా భారత్ ఫ్యూచర్ సిటీకి మరో కొత్త రహదారి రూపుదిద్దుకుంటోంది. 30 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు.. 10 కంపెనీలకు వెయ్యి ఎకరాల భూములు.. రతన్ టాటా రేడియల్ రోడ్డుతో అనుసంధాన ప్రణాళిక. దక్షిణ హైదరాబాద్‌లో పారిశ్రామిక అభివృద్ధికి, రవాణా సౌకర్యాల విస్తరణకు ఈ కొత్త రహదారి ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0