దుబాయ్ రియల్‌ ఎస్టేట్‌లో దూకుడు

Dubai’s real estate market recorded strong growth in the first half of 2026, with 104 projects completed between January and June, involving investments of more than AED 111 billion.

Sep 26, 2026 - 08:03
 0  8
దుబాయ్ రియల్‌ ఎస్టేట్‌లో దూకుడు
dubai-real-estate-104-projects-completed-h1-2026

-      ఆరు నెలల్లో 104 ప్రాజెక్టులు పూర్తి

దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ 2026 తొలి అర్ధభాగంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. జనవరి నుంచి జూన్‌ వరకు 104 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటి మొత్తం పెట్టుబడి విలువ 111 బిలియన్‌ దిర్హామ్‌ (సుమారు 30.2 బిలియన్‌ డాలర్లు) దాటింది. దుబాయ్‌ ల్యాండ్‌ డిపార్ట్‌మెంట్‌ (డీఎల్ డీ) గణాంకాల ప్రకారం.. 2025 తొలి అర్ధభాగంలో పూర్తైన 75 ప్రాజెక్టులతో పోలిస్తే ఈసారి ప్రాజెక్టుల సంఖ్య 38.7 శాతం పెరిగింది. ప్రాజెక్టుల పెట్టుబడి విలువ కూడా ఏడాది క్రితంతో పోలిస్తే 52 శాతం పెరిగింది.

ప్రాజెక్టుల పూర్తితో దుబాయ్‌ మార్కెట్‌లోకి భారీగా కొత్త గృహాలు వచ్చాయి. 2026 తొలి ఆరు నెలల్లో 24,537 కొత్త రెసిడెన్షియల్‌ యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. 2025 ఇదే కాలంలో 18,043 యూనిట్లు మాత్రమే పూర్తయ్యాయి. అంటే కొత్త నివాస యూనిట్ల సరఫరా 36 శాతం పెరిగింది. అలాగే పూర్తయి, కొనుగోలుదారులకు అప్పగించేందుకు సిద్ధమైన భవనాల నిర్మిత విస్తీర్ణం 1.95 మిలియన్‌ చదరపు మీటర్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 1.58 మిలియన్‌ చదరపు మీటర్లుగా ఉంది. అంటే రెడీ-టు-హ్యాండోవర్‌ బిల్ట్‌-అప్‌ ఏరియా 23.4 శాతం పెరిగింది.

భూమి విలువలో భారీ పెరుగుదల

దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భూమికి పెరుగుతున్న డిమాండ్‌ కూడా ఈ గణాంకాల్లో కనిపించింది. పూర్తైన ప్రాజెక్టులకు కేటాయించిన భూమి విలువ 19.46 బిలియన్‌ దిర్హామ్‌లకు చేరింది. 2025 తొలి అర్ధభాగంలో ఇది 8.27 బిలియన్‌ దిర్హామ్‌లుగా ఉంది. అంటే భూమి విలువ 135 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో పూర్తైన ప్రాజెక్టులకు కేటాయించిన భూమి విస్తీర్ణం కూడా దాదాపు రెట్టింపై సుమారు 10 లక్షల చదరపు మీటర్లకు చేరింది.

గత ఏడాది ఇదే సమయంలో 4.84 లక్షల చదరపు మీటర్ల భూమి మాత్రమే కేటాయించారు. కొత్త ప్రాజెక్టులు, పెరుగుతున్న గృహ సరఫరా, భారీ పెట్టుబడులు దుబాయ్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దుబాయ్‌లో విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన నియంత్రణ వ్యవస్థ, డిజిటల్‌ రియల్‌ ఎస్టేట్‌ మౌలిక వసతులు, మార్కెట్‌లో పారదర్శకత వంటి అంశాలు పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0