కోకాపేట్ నియోపోలిస్‌లో బ్రిగేడ్ బంపరాఫర్!
Brigade Group has secured a 4.59-acre plot in Kokapet Neopolis in an HMDA auction by bidding ₹120 crore per acre, taking the total deal value to around ₹550 crore.
కోకాపేట్ నియోపోలిస్‌లో బ్రిగేడ్ గ్రూప్ బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో ఈ సంస్థ ఎకరానికి రూ.120 కోట్లు పెట్టి 4.59 ఎకరాల్ని దక్కించుకుంది. ఇందుకోసం బ్రిగేడ్ సంస్థ.. దాదాపు రూ.550 కోట్లను వెచ్చిస్తుంది. ఇదే పదిహేడో ప్లాటు కోసం 2025 నవంబరులో హెచ్ఎండీఏ చేపట్టిన వేలం పాటలో.. వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ ఎకరానికి రూ.136.50 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది. మొత్తం రూ.626.53 కోట్లను కట్టాల్సి ఉండగా.. ప్రీలాంచ్‌లో సొమ్మును సమీకరించలేక చతికిలపడింది. అయితే పదకొండు నెలల తర్వాత అదే ప్లాటును వేలం వేయగా కేవలం బ్రిగేడ్ సంస్థ ముందుకొచ్చింది. ఎకరానికి రూ.120 కోట్లు పెట్టింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0