హైదరాబాద్లో గజం ధర.. రూ.69,999
Asta Meadows is a 15+ acre gated villa-plot community in Hyderabad’s Beeramguda–BHEL corridor, offering 173 plots ranging from 200–500 sq. yards.
- బీరంగూడ-బీహెచ్‌ఈఎల్ కారిడార్‌లో విల్లా ప్లాట్లు
- ఆస్టా మెడోస్ పేరుతో 15 ఎకరాలకు పైగా గేటెడ్ ప్లాట్ కమ్యూనిటీ
హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ కారిడార్లలో ప్లాటెడ్ డెవలప్‌మెంట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు పెద్ద స్థలాలను కోరుకుంటుండటంతో విల్లా ప్లాట్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీరంగూడ-బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఆస్టా మెడోస్ పేరుతో విల్లా ప్లాట్ కమ్యూనిటీ అందుబాటులోకి వచ్చింది. 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 173 ప్లాట్లు ఉండగా.. ఇవి 200 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుకు హెచ్‌ఎండీఏ, తెలంగాణ రెరా అనుమతి లభించింది. ఈ గేటెడ్ లేఅవుట్‌లోని ప్లాట్లు 100 శాతం వాస్తు ప్రకారం రూపొందించారు. 40 అడుగులు, 30 అడుగుల సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, నీరు, విద్యుత్ కనెక్షన్లు, ఎల్‌ఈడీ స్ట్రీట్ లైట్లు, అవెన్యూ ప్లాంటేషన్, ల్యాండ్‌స్కేప్డ్ గ్రీన్ జోన్లు వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. విల్లా నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును రూపొందించారు. దీంతో కొనుగోలుదారులు తమ అవసరాలకు అనుగుణంగా సొంత ఇంటిని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీలో క్లబ్‌హౌస్‌తో పాటు 20కి పైగా లైఫ్‌స్టైల్ సదుపాయాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. పిల్లల ఆట స్థలం, అవుట్‌డోర్ గేమ్స్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఓఆర్‌ఆర్ నుంచి సుమారు ఐదు నిమిషాల దూరంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. ఇక్కడికి సమీపంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ఐటీ హబ్‌లకు కనెక్టివిటీ ఉందని తెలిపింది. బీరంగూడ-బీహెచ్‌ఈఎల్ కారిడార్‌లోనూ రెసిడెన్షియల్ డెవలప్‌మెంట్ వేగంగా జరుగుతోంది. చదరపు గజానికి రూ.69,999 ధరతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు రుణం సదుపాయాన్ని సంస్థ ప్రొవైడ్ చేస్తుంది. అలా ప్లాటు కొనగానే ఇలా రిజిస్ట్రేషన్ చేసిస్తామని సంస్థ చెబుతోంది. విల్లా నిర్మాణం కోసం సొంత స్థలం కోరుకునే వారికి ఆస్టా మెడోస్ చక్కటి ఎంపిక అని చెప్పొచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0