తెల్లాపూర్ లో అదిరిపోయే ఆకాశసౌథం..  ‘రాజపుష్ప ఆరేలియా’..

Rajapushpa Aurelia is an upcoming ultra-luxury residential project by Rajapushpa Properties in Tellapur, located close to Hyderabad’s IT corridor.

Sep 18, 2026 - 06:50
 0  19
తెల్లాపూర్ లో అదిరిపోయే ఆకాశసౌథం..   ‘రాజపుష్ప ఆరేలియా’..
rajapushpa-aurelia-tallest-residential-project-tellapur
  • 56 అంతస్తులతో తెల్లాపూర్ లోనే అత్యంత 
  • ఎత్తైన నివాస సముదాయంగా రికార్డు..

హైదరాబాద్ ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలు నివాసానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉన్న తెల్లాపూర్ ఇప్పుడు అల్ట్రా-లగ్జరీ అపార్ట్‌మెంట్లకు ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఇక్కడ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సరికొత్త ప్రాజెక్టే రాజపుష్ప ఆరేలియా. విలాసానికి, అధునాతన సౌకర్యాలకు ఈ ప్రాజెక్టు మారుపేరుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సుమారు 12.51 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ అల్ట్రా-లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో మొత్తం 7 టవర్లు ఉండగా, ప్రతి టవర్ ఏకంగా 56 నుంచి 56 అంతస్తులతో నిర్మితమవుతోంది. తెల్లాపూర్ ప్రాంతంలోనే ఇది అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ ల్యాండ్‌మార్క్‌ కావడం విశేషం. ఈ ప్రాజెక్టులో మొత్తం 1561 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి.

సాధారణ అపార్ట్‌మెంట్లకు భిన్నంగా రాజపుష్ప ఆరేలియాలో కేవలం విశాలమైన 3 బీహెచ్ కే, 4 బీహెచ్ కే ఫ్లాట్లను మాత్రమే నిర్మిస్తున్నారు. 3 బీహెచ్ కే ఫ్లాట్ల విస్తీర్ణం 3015 చ.అ. నుంచి 3435 చ.అ. వరకు ఉండగా.. 4 బీహెచ్ కే ఫ్లాట్ల విస్తీర్ణం 3995 చ.అ. నుంచి 4400 చ.అ. వరకు ఉంటుంది. ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే.. ప్రతి ఫ్లాట్‌లో సీలింగ్ హైట్ 11 అడుగుల ఎత్తు ఉంటుంది. దీనివల్ల ఇంటి లోపల అద్భుతమైన గాలి, వెలుతురుతో పాటు విశాలమైన అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఫ్లాట్‌కి ఒక ప్రత్యేకమైన 'మెయిడ్ రూమ్' కూడా కేటాయించారు. ఇక ప్రతి ఫ్లోర్ లో నాలుగు యూనిట్లు మాత్రమే ఉండేలా డిజైన్ చేశారు. మొత్తం ప్రాజెక్టులో 76 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉంటుంది.

ప్రపంచ స్థాయి వసతులు

ఈ ప్రాజెక్టులో నివాసం ఉండే వారి కోసం ఒక విలాసవంతమైన రిసార్ట్ లాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 75,000 పైచిలుకు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బృహత్తర క్లబ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక జిమ్నాసియం, లాంజ్, బ్యాంక్వెట్ హాల్, క్రీడాకారుల కోసం ఔట్-డోర్ టెన్నిస్ కోర్టులు, ఇండోర్ బోర్డ్ గేమ్స్, చిన్నారుల కోసం టోడ్లర్ ప్లే ఏరియా, అడ్వెంచర్ ప్లే జోన్, విశ్రాంతి కోసం వృద్ధుల సీటింగ్ జోన్, యోగా డెక్, నేటి తరానికి అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారి కోసం ప్రత్యేక వర్క్ జోన్స్, కేఫెటేరియా వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

అద్భుతమైన కనెక్టివిటీ

తెల్లాపూర్‌లోని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ.. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఇక్కడి నుంచి కనెక్టివిటీ చాలా సులభంగా ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడి నుండి కేవలం 2.4 కి.మీ దూరంలోనే ఉంది. ఐటీ ఉద్యోగులకు వరంగా.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కేవలం 12 నిమిషాలు, గచ్చిబౌలికి 20-25 నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. గ్లెన్‌డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, కాంటినెంటల్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కేవలం 10-20 నిమిషాల డ్రైవింగ్ దూరంలోనే ఉన్నాయి.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్టు అక్టోబర్ 2028 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందులో ఫ్లాట్ల ధర పరిమాణాన్ని బట్టి సుమారు రూ. 2.36 కోట్ల నుంచి రూ. 3.46 కోట్ల వరకు ఉంటాయి. తెల్లాపూర్, గచ్చిబౌలి పరిసరాల్లో ఐటీ కంపెనీల విస్తరణ వేగంగా జరుగుతున్నందున, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడిదారులకు, సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులకు, ఉన్నత వర్గాల వారికి 'రాజపుష్ప ఆరేలియా' ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో లగ్జరీ, అపారమైన స్థలం, కనెక్టివిటీ.. ఈ మూడింటినీ ఒకే చోట కోరుకునే వారికి టెల్లాపూర్‌లోని 'రాజపుష్ప ఆరేలియా' సరికొత్త చిరునామాగా మారనుంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0