ఇల్లు స్వాధీనం తీసుకున్నా.. ఆలస్యానికి వడ్డీ పొందొచ్చా?
The Bombay High Court has provided relief to homebuyers who receive possession of their flats after a project is delayed.
నిర్మాణ సంస్థ నుంచి ఆలస్యంగా ఇంటి స్వాధీనం తీసుకున్న గృహ కొనుగోలుదారులకు బాంబే హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. ప్రాజెక్టు ఆలస్యమైనప్పటికీ ఫ్లాట్ తాళాలు తీసుకున్న తర్వాత కూడా.. ఆలస్యమైన కాలానికి డెవలపర్ నుంచి వడ్డీ కోరే హక్కు కొనుగోలుదారులకు ఉంటుందని స్పష్టం చేసింది. స్వాధీనం తీసుకునే సమయంలో పరిహారం కోరుతామని ప్రత్యేకంగా నోటీసు ఇవ్వకపోయినా ఈ హక్కు కోల్పోరని తేల్చింది. గోరేగావ్ పాత్రా చాల్ పునరాభివృద్ధి ప్రాజెక్టులో ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన వారికి ఒప్పందం ప్రకారం 2018 జూన్ 30లోగా స్వాధీనం ఇవ్వాల్సి ఉంది. అయితే నిర్ణీత గడువులోగా ఫ్లాట్ అప్పగించలేదు.
అనంతరం కొనుగోలుదారులు ఫ్లాట్ స్వాధీనం తీసుకున్నారు. అయితే ఆలస్యానికి వడ్డీ కోరడంతో వివాదం మొదలైంది. ఫ్లాట్ తీసుకున్న తర్వాత ఆలస్యంపై పరిహారం కోరేందుకు ముందస్తుగా ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, అందువల్ల కొనుగోలుదారులకు పరిహారం కోరే హక్కు లేదని డెవలపర్ వాదించాడు. అయితే, డెవలపర్ వాదనను హైకోర్టు తిరస్కరించింది. రెరాలోని సెక్షన్ 18 ప్రకారం, ఒప్పందంలో పేర్కొన్న తేదీకి ఫ్లాట్ స్వాధీనం ఇవ్వడంలో డెవలపర్ విఫలమైతే.. కొనుగోలుదారుకు ఆలస్యమైన ప్రతి నెలకు వడ్డీ పొందే హక్కు ఉంటుందని తెలిపింది. ఈ హక్కు సాధారణ కాంట్రాక్టు నిబంధనలపై ఆధారపడేది కాదని, కొనుగోలుదారుకు చట్టం కల్పించిన స్వతంత్ర, తిరస్కరించలేని హక్కు అని కోర్టు పేర్కొంది. అంటే, ఆలస్యమైన ఇంటి తాళాలు తీసుకున్నంత మాత్రాన గత ఆలస్యానికి వడ్డీ కోరే హక్కును కొనుగోలుదారు వదులుకున్నట్లు కాదని స్పష్టం చేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0