ఏపీలో 17,912 పట్టణ ఇళ్లకు రూ.447.8 కోట్ల మంజూరు

The Andhra Pradesh government has sanctioned ₹447.8 crore for the construction of 17,912 urban houses under the Pradhan Mantri Awas Yojana–Urban 2.0 (PMAY-U 2.0) for the financial years 2025–26 and 2026–27.

Sep 4, 2026 - 03:17
 0  52
ఏపీలో 17,912 పట్టణ ఇళ్లకు రూ.447.8 కోట్ల మంజూరు
ap-approves-rs-447-8-crore-for-17912-urban-houses

పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–అర్బన్‌ 2.0లో భాగంగా 17,912 ఇళ్ల నిర్మాణానికి రూ.447.8 కోట్లతో పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఈ ఇళ్లను బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ (బీఎల్ సీ) విధానంలో నిర్మించనున్నారు.

ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉన్న అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు తమ ఇళ్లను నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మంజూరు చేసిన పథకం ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు యూనిట్‌ కాస్ట్‌గా నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం అంటే రూ.1.50 లక్షలు ఆర్థిక సహాయంగా అందిస్తుంది. మిగిలిన 40 శాతం అంటే రూ. లక్షను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే మంజూరైన రూ.2.50 లక్షలకు మించి ఇల్లు పూర్తిచేయడానికి అదనపు ఖర్చు అవసరమైతే.. ఆ మొత్తాన్ని లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది.

బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ అంటే?

బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ విధానంలో అర్హులైన లబ్ధిదారులు తమకు ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకునేందుకు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతారు. అంటే ప్రభుత్వం ప్రతి ఇంటినీ స్వయంగా నిర్మించి లబ్ధిదారులకు అప్పగించడం కాకుండా.. లబ్ధిదారుడే ఇంటి నిర్మాణాన్ని చేపట్టే విధానం ఇది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, నిర్మాణ ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం జరగాల్సి ఉంటుంది.

ఈ పథకంలో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం రూ.2.50 లక్షల యూనిట్‌ కాస్ట్‌ పరిమితి. కేంద్రం, రాష్ట్రం కలిపి అందించే రూ.2.50 లక్షల కంటే ఇంటి నిర్మాణానికి ఎక్కువ ఖర్చు అయితే.. ఆ అదనపు మొత్తాన్ని లబ్ధిదారులే సమకూర్చుకోవాలి. అంటే నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, అదనపు సౌకర్యాలు కల్పించడం లేదా నిర్ణయించిన యూనిట్‌ కాస్ట్‌కు మించి నిర్మాణ వ్యయం పెరగడం వంటి సందర్భాల్లో ఆ అదనపు భారం ప్రభుత్వంపై ఉండదు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0