మూడంతస్తులు.. రూ.33 లక్షలు

Bollywood megastar Amitabh Bachchan is set to earn substantial rental income from his commercial real estate investments in Mumbai.

Aug 23, 2026 - 02:19
 0  70
మూడంతస్తులు.. రూ.33 లక్షలు
amitabh-bachchan-mumbai-property-lease-rental-income
  • అమితాబ్ కు భారీగా అద్దె ఆదాయం
  • ఐదేళ్లకు రూ.22 కోట్ల డీల్

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడుల నుంచి మరో భారీ ఆదాయాన్ని అందుకోనున్నారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌ ప్రాంతంలో తనకు చెందిన సిగ్నేచర్ అనే వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ప్రముఖ న్యూట్రిషన్‌ బ్రాండ్‌ ట్రూనేటివ్‌ ఎఫ్‌అండ్‌బీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కు లీజుకు ఇచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ ప్రతి నెలా రూ.33 లక్షల అద్దె చెల్లించనుంది. మూడు అంతస్తులు కలిపి సుమారు 8,428 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియా ఉంది.

అంతేకాకుండా లీజుదారుకు భవనంలో ప్రత్యేకంగా తొమ్మిది కార్ల పార్కింగ్‌ స్థలాలు కూడా కేటాయించారు. ఐదేళ్ల కాలానికి ఈ లీజు ఒప్పందం కుదిరింది. 2026 ఆగస్టు 15 నుంచి లీజు ప్రారంభమైంది. ట్రూనేటివ్‌ సంస్థ ఇప్పటికే రూ.1.98 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించినట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. ప్రారంభంలో నెలకు రూ.33 లక్షలుగా ఉన్న అద్దె.. ప్రతి ఏడాది 5 శాతం చొప్పున పెరుగుతుంది.

ఈ లెక్కన ఐదేళ్లలో అద్దె రూపంలో వచ్చే మొత్తం సుమారు రూ.21.88 కోట్లుగా ఉండనుంది. అమితాబ్‌ బచ్చన్‌కు ముంబై రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు కొత్తేమీ కాదు. ముఖ్యంగా అంధేరీ వెస్ట్‌, ఓషివారా ప్రాంతాల్లో ఆయన పలు కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసి, వాటిని కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. గత నాలుగేళ్లలో బచ్చన్‌ కుటుంబం ముంబైలో సుమారు రూ.194 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఈ ఆస్తుల మొత్తం విస్తీర్ణం దాదాపు 1.8 లక్షల చదరపు అడుగులుగా ఉంది.

వార్నర్‌ మ్యూజిక్‌కు కూడా ఆఫీస్‌ స్పేస్‌

అమితాబ్‌ గతంలో కూడా తన కమర్షియల్ ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చారు. 2023లో ఆయన ముంబైలోని లోటస్‌ సిగ్నేచర్‌ అనే భవనంలో ఉన్న నాలుగు ఆఫీస్‌ యూనిట్లను వార్నర్‌ మ్యూజిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం నెలకు రూ.17.30 లక్షల అద్దె లభించేలా ఒప్పందం కుదిరింది. ఆ కార్యాలయాల విస్తీర్ణం సుమారు 10,180 చదరపు అడుగులు. ఐదేళ్ల లీజులో తర్వాతి దశలో అద్దె పెంచే నిబంధన కూడా ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0