కొత్త ఫ్యామిలీ లొకేష‌న్స్‌ కొల్లూరు & తెల్లాపూర్‌.. 

Tellapur and Kollur are emerging as new family residential corridors in West Hyderabad, attracting IT professionals working in Gachibowli, Financial District and HITEC City.

Aug 26, 2026 - 08:12
 0  11
కొత్త ఫ్యామిలీ లొకేష‌న్స్‌ కొల్లూరు & తెల్లాపూర్‌.. 
New Family-Friendly Locations: Kollur & Tellapur

హైదరాబాద్‌ పశ్చిమ భాగంలో ఒకప్పుడు నగరానికి దూరంగా కనిపించిన తెల్లాపూర్‌, కొల్లూరు.. ఇప్పుడు అదే నగరానికి కొత్త ఫ్యామిలీ రెసిడెన్షియల్‌ కారిడార్‌ గా మారుతున్నాయి. గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌ సిటీ వైపు పనిచేసే ఐటీ ఉద్యోగులకు దగ్గరగా ఉండటం.. మరోవైపు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాలతో పోలిస్తే కొంత అందుబాటులో ఉండే ఇళ్ల ఎంపికలు ఉండటంతో డిమాండ్‌ పెరుగుతోంది. అయితే ఈ రెండు ప్రాంతాల్లోనూ ధరలు ఒకేలా లేవు. తెల్లాపూర్‌ ప్రీమియం అపార్ట్‌మెంట్‌ మార్కెట్‌గా ఎదుగుతుంటే.. కొల్లూరు ఇంకా వాల్యూ-ఫర్-మనీ, భారీ టౌన్‌షిప్‌లు, విల్లాలు, ప్లాట్ల మార్కెట్‌గా కనిపిస్తోంది.

తెల్లాపూర్‌లో ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌ మార్కెట్‌ సగటు ధర చదరపు అడుగుకు 8,661గా ఉంది. గత త్రైమాసికంతో పోలిస్తే సుమారు ఒక శాతం పెరుగుదల నమోదైంది. మార్కెట్‌ రేంజ్‌ సుమారు 6,615 నుంచి 10,707 వరకు కనిపిస్తోంది. ఇక్కడ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కేలకే ప్రధాన డిమాండ్‌ కనిపిస్తోంది. 2 బీహెచ్‌కేలకు చదరపు అడుగుకు సుమారు 7,200-11,400, 3 బీహెచ్‌కేలకు 6,400-10,600 వరకు ధరలు కనిపిస్తున్నాయి. అంటే 2 బీహెచ్‌కే ప్రాజెక్టును బట్టి 84 లక్షల నుంచి 1.50 కోట్ల వరకు, 3 బీహెచ్‌కేకు 1.05 కోట్ల నుంచి 2.50 కోట్ల వరకు మార్కెట్‌ లిస్టింగ్స్‌ ఉన్నాయి.

తెల్లాపూర్‌తో పోలిస్తే కొల్లూరులో ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. కొల్లూరు అపార్ట్‌మెంట్ల సగటు ధర 6,629 చదరపు అడుగుగా ఉంది. 2025లో ఇదే సగటు సుమారు 5,995గా ఉండగా.. ఏడాదిలో దాదాపు 12 శాతం పెరుగుదల నమోదైంది. 2024లో 5,348, 2023లో 4,693గా ఉన్న సగటు ధరలు క్రమంగా పెరిగాయి. 2 బీహెచ్‌కేలకు సుమారు 5,300-7,900, 3 బీహెచ్‌కేలకు 5,400-7,800 చదరపు అడుగు వరకు ధరలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌ లిస్టింగ్స్‌ ప్రకారం 2 బీహెచ్‌కే లు 65 లక్షల నుంచి 1.21 కోట్ల వరకు, 3 బీహెచ్‌కేలు 88.4 లక్షల నుంచి 1.82 కోట్ల వరకు ఉన్నాయి.

ఫ్లాట్‌ కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చూసే వారికి కూడా ఈ రెండు ప్రాంతాల్లో ప్లాట్ల మార్కెట్‌ ఆసక్తికరంగా ఉంది. కొల్లూరులో 2026 రెండో త్రైమాసికానికి రెసిడెన్షియల్‌ ప్లాట్ల సగటు ధర చ.గజానికి 46,836గా ఉంది. త్రైమాసికంగా సుమారు 8 శాతం పెరుగుదల నమోదైంది. అయితే ఇది సగటు మార్కెట్‌ సూచిక మాత్రమే. లేఅవుట్‌ అనుమతులు, ప్రధాన రహదారికి దూరం, రోడ్డు వెడల్పు, కార్నర్‌ ప్లాట్‌, ప్రాజెక్టు బ్రాండ్‌ వంటి అంశాలపై ధర భారీగా మారుతుంది. ఇటీవలి కొల్లూరులో 45-50 లక్షల పరిధిలో 133-165 చ.గజాల ప్లాట్లు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రీమియం ప్రాజెక్టుల్లో 180-200 చ.గజాల ప్లాట్లు 90 లక్షల స్థాయికి చేరుతున్న ఉదాహరణలు ఉన్నాయి.

తెల్లాపూర్‌-కొల్లూరు కారిడార్‌కు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నది విల్లా మార్కెట్‌. ఇక్కడ చిన్న బడ్జెట్‌ విల్లాల నుంచి ప్రీమియం 3, 4 3 బీహెచ్‌కే విల్లాల వరకు విస్తృత రేంజ్‌ ఉంది. ప్రస్తుతం తెల్లాపూర్‌లో సుమారు 3.5 కోట్ల నుంచి 3.8 కోట్ల వరకు 4 BHK విల్లాలు, 4 కోట్లకు పైగా 3-4 3 బీహెచ్‌కే ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి. మరోవైపు కొల్లూరులో కొన్ని కొత్త ప్రాజెక్టుల్లో 3 బీహెచ్‌కే విల్లాలు 3.55–4.67 కోట్లు, 4 బీహెచ్‌కే సుమారు 5.32 కోట్ల వద్ద ఉన్నాయి.  ఇక కొంత పాత లేదా చిన్న ప్రాజెక్టుల్లో ధరలు తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే విల్లా మార్కెట్‌లో ఒకే ధర అనే మాటే లేదు. ప్రాజెక్టు వయసు, ప్లాట్‌ సైజు, క్లబ్‌హౌస్‌, సౌకర్యాలు, గేటెడ్‌ కమ్యూనిటీ, మెయిన్‌ రోడ్‌కు దూరం.. అన్నీ ధరను నిర్ణయిస్తున్నాయి.

తెల్లాపూర్ స‌గ‌టు అపార్ట్‌మెంట్ ధ‌ర‌-రూ.8,661/చ.అ.
కొల్లూరు స‌గ‌టు అపార్ట్‌మెంట్ రేటు-రూ.6,629/చ.అ.

తెల్లాపూర్ 2 బీహెచ్‌కే-రూ.7,200-11,400/చ.అ.
తెల్లాపూర్ 3 బీహెచ్‌కే-రూ.6,400-10,600/చ.అ.

కొల్లూరు 2 బీహెచ్‌కే-రూ.5,300-7,900/చ.అ.
కొల్లూరు 3 బీహెచ్‌కే-రూ.5,400-7,800/చ.అ.

తెల్లాపూర్‌ 2 బీహెచ్‌కేలు-రూ.84 లక్షలు-1.50 కోట్లు
తెల్లాపూర్‌ 3 బీహెచ్‌కేలు-రూ.1.05-2.50 కోట్లు

కొల్లూరు 2 బీహెచ్‌కేలు-రూ.65 లక్షలు-1.21 కోట్లు
కొల్లూరు 3 బీహెచ్‌కేలు-రూ.88.4 లక్షలు-1.82 కోట్లు
కొల్లూరు ప్లాట్లు-సగటు రూ.46,836/చ.గజం

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0