తెలంగాణలో గ్లాస్ బ్రిడ్జి రెడీ
Telangana is set to get a new tourist attraction with the state’s first heart-shaped glass bridge, being developed over Yellamma Cheruvu in Husnabad.
తెలంగాణలో మరో సరికొత్త టూరిస్ట్ డెస్టినేషన్ అందుబాటులోకి రానుంది. ప్రకృతి అందాలకు ఆధునిక హంగులు జోడిస్తూ హార్ట్ షేప్ లో నిర్మిస్తున్న రాష్ట్రంలోని తొలి గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్‌పై పర్యాటకులు, యువత, ఫోటోగ్రఫీ ప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ను హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువుపై నిర్మిస్తున్నారు. సుమారు 150 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో హార్ట్ షేప్‌లో రూపొందిస్తున్న ఈ బ్రిడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నీటి మట్టానికి సుమారు 20 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ వంతెనపై నడుస్తూ చెరువు అందాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంటుంది.
వాక్ ఆన్ ఎయిర్ అనుభూతి
అత్యంత బలమైన పారదర్శక గ్లాస్ ప్యానెల్స్‌తో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్‌పై నడిచే వారికి వాక్ ఆన్ ఎయిర్ అంటే గాల్లో నడిచిన అనుభూతి కలిగేలా డిజైన్ చేశారు. కింద నీరు కనిపించేలా ఉండటంతో అడ్వెంచర్‌తో పాటు ప్రత్యేక అనుభూతిని అందించే టూరిస్ట్ స్పాట్‌గా ఇది మారనుంది.
కేవలం బ్రిడ్జే కాదు... పూర్తి టూరిజం హబ్
గ్లాస్ బ్రిడ్జ్‌తో పాటు ఎల్లమ్మ చెరువు పరిసరాలను పూర్తిస్థాయి టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. బతుకమ్మ ఘాట్, అందమైన గార్డెన్స్, వాకింగ్ ట్రాక్, అలంకరణ లైటింగ్, సెల్ఫీ పాయింట్లు, పచ్చదనం వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో హుస్నాబాద్ ప్రాంతం రాష్ట్రంలో ప్రముఖ వీకెండ్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
లవర్స్, కపుల్స్‌కు స్పెషల్ అట్రాక్షన్
హార్ట్ షేప్ డిజైన్ కారణంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ప్రేమికులు, కొత్తగా వివాహమైన జంటలు, కుటుంబాలు, ట్రావెల్ బ్లాగర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే డ్రోన్ వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో ప్రారంభం కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
త్వరలో ప్రారంభం
ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. భద్రతా పరీక్షలు, తుది ఏర్పాట్లు పూర్తయ్యాక ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే తెలంగాణ టూరిజానికి మరో గుర్తింపు లభించడంతో పాటు స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0