సెక్షన్ 22-ఏలోకి.. ఎంట్రీ చేయడమెందుకు? తొలగించడమెందుకు?
Telangana’s latest move on Section 22-A properties could provide relief to owners whose legally approved plots, houses and flats have been blocked from registration. T
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ అనుమతుల్ని కలిగి.. చట్టపరంగా అర్హత గల ప్రైవేటు ఆస్తులకు.. 22ఏ కారణంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను అనుమతించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. నిర్మాణ రంగానికి, ఆస్తి యజమానులకు ఎంతో ఊరటిస్తుంది. రిజిస్ట్రేషన్లపై స్పష్టత వస్తే కొనుగోలుదారుల్లో నెలకొన్న భయం, అయోమయం తగ్గుతాయి. సందేహాల కారణంగా కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నవారు కూడా ముందుకొచ్చి ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లను కొనుక్కునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులపై విశ్వాసం పెరిగి, నిర్మాణ రంగానికి మేలు జరుగుతుంది. అయితే, అన్నీ పక్కాగా ఉన్న లేఅవుట్లు, ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలను అసలీ సెక్షన్ 22ఏ కింద తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని చెప్పొచ్చు. అసలు చట్టబద్ధంగా అంతా పక్కాగా ఉన్న ప్రాపర్టీలను సెక్షన్ 22ఏ కిందికి తీసుకురావడమెందుకు? మళ్లీ.. తూచ్ తప్పు జరిగిందని సరిదిద్దడమెందుకు అని రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ సమస్య పూర్తిగా సమసిపోతేనే.. వచ్చే కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0