డీమార్ట్ అధినేత ఫ్లాట్ కు రూ.28.5 లక్షల అద్దె

A company linked to DMart founder and billionaire Radhakishan Damani has leased a luxury apartment in Mumbai’s Worli for a starting rent of ₹28.5 lakh per month, making it one of the city’s notable high-value residential rental deals.

Oct 6, 2026 - 06:31
 0  66
డీమార్ట్ అధినేత ఫ్లాట్ కు రూ.28.5 లక్షల అద్దె
radhakishan-damani-luxury-flat-rent-mumbai

డీమార్ట్‌ వ్యవస్థాపకుడు, బిలియనీర్‌ రాధాకిషన్‌ దమానీకి చెందిన సంస్థ ముంబయి వర్లీ ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను నెలకు రూ.28.5 లక్షల ప్రారంభ అద్దెకు లీజుకు ఇచ్చింది. ముంబయిలో నమోదైన అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ రెంటల్‌ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచింది. దమానీ కుటుంబ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న డెరివ్‌ ట్రేడింగ్‌ అండ్‌ రిసార్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ అపార్ట్‌మెంట్‌ను లీజుకు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాల్లో పేర్కొన్నారు. వర్లీ డాక్టర్‌ అన్నీ బిసెంట్‌ రోడ్‌లోని ‘త్రీ సిక్స్టీ వెస్ట్‌’ ప్రాజెక్టులో టవర్‌-బిలోని 19వ అంతస్తులో ఈ ఫ్లాట్‌ ఉంది.

'మొత్తం 6,831 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌ను ఐవీఎల్ ధున్‌సెరి పెట్రోకెమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లీజుకు తీసుకుంది. ఒప్పందంలో నాలుగు కార్ల పార్కింగ్‌ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లీజ్‌ ఒప్పందాన్ని 2026 సెప్టెంబర్‌ 28న రిజిస్టర్‌ చేశారు. మొత్తం 36 నెలల కాలానికి ఒప్పందం కుదిరింది. మొదటి ఏడాది నెలకు రూ.28.5 లక్షలుగా ఉన్న అద్దె.. ప్రతి ఏడాది పెరగనుంది. మొదటి సంవత్సరం రూ.28.5 లక్షలు, రెండో ఏడాది రూ.29.92 లక్షలు, మూడో సంవత్సరం రూ.31.42 లక్షల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఈలెక్కడ మూడేళ్లలో మొత్తం అద్దె రూ.10.78 కోట్లు అవుతుంది.

ఈ లావాదేవీలో అద్దెదారు రూ.1.71 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించారు. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2.83 లక్షల స్టాంప్‌ డ్యూటీ, రూ.1,000 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించారు. దమానీకి సంబంధించిన సంస్థ ఇదే త్రీ సిక్స్టీ వెస్ట్‌ భవనంలో మరో అపార్ట్‌మెంట్‌ను కూడా ఈ ఏడాది మేలో లీజుకు ఇచ్చింది. వన్‌ ఎస్‌జీజీ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీకు ఆ ఫ్లాట్‌ను నెలకు రూ.27.5 లక్షల అద్దెకు ఇచ్చారు. దమానీ కుటుంబం, ఆయనకు సన్నిహితులు, అనుబంధ సంస్థలు 2023లో ఇదే త్రీ సిక్స్టీ వెస్ట్‌ ప్రాజెక్టులో 28 లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశారు. ఇందుకోసం మొత్తం రూ.1,238 కోట్లు వెచ్చించారు. వీటి మొత్తం కార్పెట్‌ ఏరియా 1,82,084 చదరపు అడుగులు కాగా, 101 కార్‌ పార్కింగ్‌ స్థలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులోని కొన్ని అపార్ట్‌మెంట్లను భారీ అద్దెలకు లీజుకు ఇవ్వడం ద్వారా దమానీ కుటుంబానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల నుంచి అద్దె ఆదాయం పొందుతున్నట్లు తాజా లావాదేవీలు సూచిస్తున్నాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0