హెచ్‌జీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్. ఉపేందర్ రెడ్డి నియామకం
R. Upender Reddy, IAS, Joint Metropolitan Commissioner, HMDA, has assumed Full Additional Charge (FAC) as Managing Director of Hyderabad Growth Corridor Limited (HGCL) following Telangana Government orders under G.O. No. 808.
హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆర్ ఉపేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నెం.808ను విడుదల చేసింది. ఇప్పటివరకూ ఆయన హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా వ్యవహరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్. ఉపేందర్ రెడ్డి.. హెచ్‌జీసీఎల్ ఉన్నతాధికారులు మరియు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సంస్థకు సంబంధించిన ప్రస్తుత కార్యకలాపాలు, ప్రాజెక్టులు, ముఖ్యమైన అంశాలను సమీక్షించిన ఆయన, హెచ్‌జీసీఎల్‌కు అప్పగించిన ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తొలిరోజు సమీక్షలో భాగంగా ఆర్. ఉపేందర్ రెడ్డి వివిధ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి, కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించారు. పనుల నాణ్యత, సకాలంలో అమలు, సంబంధిత శాఖలు మరియు సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణ అవసరమని మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టం చేశారు. హెచ్‌జీసీఎల్ లక్ష్యాలను సాధించేందుకు, మౌలిక వసతుల పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో, చురుకైన విధానంలో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0