మూసీకి భూసేకరణ బాట.. ఎకరాకు 1,400 గజాలు
The Telangana government is speeding up the proposed land-pooling process for the Musi Riverfront Development Project, with around 2,000 acres in Uppal, Medipally and Ghatkesar likely to be brought under the framework.
ఎకరాకు 1,400 గజాలు
బఫర్‌జోన్‌కు 800 గజాలు
ఎఫ్టీఎల్ భూములకు 400 గజాలు
ఆక్రమణదారులకు 300 గజాలు
రూ.7,345 కోట్లతో తొలి దశ
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికో తాజ్ అప్డేట్ ఇది. మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భూసమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని పూర్తిగా సంప్రదాయ భూసేకరణ పద్ధతిలో కాకుండా.. భూసమీకరణ విధానంలో సమీకరించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాల్ని రూపొందించింది. తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్, మేడిపల్లి, ఘట్కేసర్ మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల భూమిని సమీకరించేందుకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం మధ్య చర్చలు జరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ప్రతిపాదిత భూసమీకరణ విధానంలో ప్రైవేటు పట్టా భూమిని ఒక ఎకరం సమీకరించుకుంటే.. దానికి బదులుగా 1,400 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలాన్ని భూయజమానికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ అభివృద్ధి చేసిన స్థలం మల్టీజోన్‌లో ఉండేలా ప్రతిపాదన ఉంది. భూయజమానులు నిబంధనలకు అనుగుణంగా ఆ స్థలంలో నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కేవలం పరిహారం చెల్లించే విధానం కాకుండా.. భూమిని సమీకరించి, మౌలిక వసతులు కల్పించి, అభివృద్ధి చేసిన ప్లాట్ల రూపంలో తిరిగి ఇవ్వడం ద్వారా భూయజమానులను ప్రాజెక్టులో భాగస్వాములను చేసే విధానంగా అధికారులు చూస్తున్నారు.
మూసీ నది బఫర్‌జోన్‌లో ఉన్న ప్రైవేటు పట్టా భూములకు ఎకరాకు 800 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలం ఇవ్వడం లేదా ఆ భూమికి ఉన్న వాణిజ్య అర్హత ఆధారంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అంటే భూమి ఉన్న ప్రాంతం, దాని వినియోగ పరిమితులు, అభివృద్ధి హక్కులను పరిగణనలోకి తీసుకుని భూయజమానికి ప్రత్యామ్నాయ ప్రయోజనం కల్పించేలా పరిహార విధానాన్ని రూపొందిస్తున్నారు. మూసీ ఎఫ్టీఎల్ పరిధిలోని ప్రైవేటు పట్టా భూములకు ఎకరాకు 400 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలం లేదా భూమి వాణిజ్య అర్హత ఆధారంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలు, భూమి వినియోగంపై ఇప్పటికే పలు పరిమితులు ఉన్న నేపథ్యంలో.. వాటిని దృష్టిలో ఉంచుకుని పరిహారాన్ని వేర్వేరు కేటగిరీలుగా విభజించినట్లు తెలుస్తోంది.
మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్న వారికి ఎకరాకు 300 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలం కేటాయించే ప్రతిపాదన కూడా ఉంది. అయితే ఇలాంటి కేసుల్లో అర్హత నిర్ధారణ, భూమి వినియోగం, కుటుంబ వివరాలు, నివాస స్థితి తదితర అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు తొలి దశకు ప్రభుత్వం రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ మొత్తంలో భూసేకరణ వ్యయం మినహాయించి ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించారు. ఇందులో రూ.4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంగా, మిగిలిన రూ.2,845.12 కోట్లను హెచ్ఎండీఏ, టీజీఐఐసీ తదితర వనరుల ద్వారా సమకూర్చే ప్రతిపాదన ఉంది. తొలి ప్రాధాన్య దశలో సుమారు 21 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్/బాపూఘాట్ వరకు 9.20 కి.మీ., ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.80 కి.మీ. మేర రెండు ప్రధాన విభాగాలుగా ఈ దశను చేపట్టనున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0