లగ్జరీ టవర్‌ నిర్మాణంపై వివాదం.. 

Mumbai’s 22-storey Palmera luxury tower in Bandra has come under scrutiny over alleged deviations from the approved building plan.

Oct 27, 2026 - 04:15
Oct 28, 2026 - 07:18
 0  74
లగ్జరీ టవర్‌ నిర్మాణంపై వివాదం.. 
ముంబై బాంద్రాలో, ఎన్‌వీకే రియాల్టీ ఎల్‌ఎల్‌పీకి చెందిన లగ్జరీ టవర్‌ నిర్మాణంపై వివాదం.
  • బిల్డర్‌కు ఎస్‌ఆర్‌ఏ నోటీసులు

దేశంలోని ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ ప్రాంతాల్లో ఒకటైన ముంబై బాంద్రాలో నిర్మించిన లగ్జరీ టవర్‌ వివాదంలో చిక్కుకుంది. నటి మాలా సిన్హాకు చెందిన పాత బంగ్లా ఉన్న స్థలంలో నిర్మించిన 22 అంతస్తుల ‘పాల్మెరా’ భవనంలో అనుమతి పొందిన నిర్మాణ ప్రణాళికకు విరుద్ధంగా మార్పులు చేశారన్న ఆరోపణలపై స్లమ్‌ రిహాబిలిటేషన్‌ అథారిటీ (ఎస్‌ఆర్‌ఏ) బిల్డర్‌కు నోటీసులు జారీ చేసింది.

ట్రాన్సిట్‌ క్యాంపుల కోసం కేటాయించిన ఆరు అంతస్తుల విషయంలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

ఎన్‌వీకే రియాల్టీ ఎల్‌ఎల్‌పీకి అక్టోబర్‌ 6న ఎస్‌ఆర్‌ఏ నోటీసులు జారీ చేసింది. భవనంలోని ఏడో అంతస్తు నుంచి 12వ అంతస్తు వరకు ఆమోదించిన ప్రణాళిక ప్రకారం మార్పులు సరిచేసి నెల రోజుల్లోగా నిబంధనలను పాటించాలని ఆదేశించింది.

లేదంటే చట్టపరమైన చర్యలు, ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. సెప్టెంబర్‌ 30న ఎస్‌ఆర్‌ఏ అధికారులు భవనాన్ని తనిఖీ చేసినప్పుడు ఈ వ్యత్యాసాలను గుర్తించారు. సామాజిక కార్యకర్త సంతోష్‌ దౌండ్కర్‌ ఆరు నెలల క్రితం దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) దరఖాస్తు నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి.

ట్రాన్సిట్‌ క్యాంపుల కోసం ఆరు అంతస్తులు

2023 సెప్టెంబర్‌ 12న ఆమోదించిన నిర్మాణ ప్రణాళిక ప్రకారం, 22 అంతస్తుల భవనంలోని ఆరు అంతస్తులను శాశ్వత ట్రాన్సిట్‌ క్యాంపు (పీటీసీ) గృహాల కోసం కేటాయించారు. నిర్మాణం పూర్తయ్యాక వాటిని ఎస్‌ఆర్‌ఏకు అప్పగించాల్సి ఉంది.

ముంబైలో రోడ్ల విస్తరణ, రైల్వే పనులు, మెట్రో ప్రాజెక్టుల వంటి మౌలిక వసతుల అభివృద్ధి కారణంగా నివాసాలు కోల్పోయే లేదా ప్రభావితమయ్యే ప్రజలకు తాత్కాలికంగా వసతి కల్పించేందుకు ఈ గృహాలు ఉపయోగపడతాయి. అయితే, అనుమతి లేకుండా గృహాల్లో మార్పులు చేసినట్లు తనిఖీల్లో గుర్తించామని ఎస్‌ఆర్‌ఏ ఉన్నతాధికారి తెలిపారు.

ముంబైలో కొనసాగుతున్న వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టుల అవసరాల కోసం కనీసం రెండు లక్షల పీటీసీ గృహాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ముంబయిలో లగ్జరీ ఇళ్ల జోరు.. రోజుకు 17 లావాదేవీలు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0