ఫ్లాట్ అప్పగింతలో జాప్యం.. బిల్డర్‌కు మహారెరా షాక్‌

MahaRERA has ordered a builder to pay interest for delayed possession of a flat in Pune’s Wagholi area. The buyer had paid ₹39.15 lakh towards a flat priced at ₹41.85 lakh, with possession due by December 31, 2024.

Oct 2, 2026 - 03:53
 0  30
ఫ్లాట్ అప్పగింతలో జాప్యం.. బిల్డర్‌కు మహారెరా షాక్‌
maharera-interest-delayed-flat-possession-pune-wagholi

ఫ్లాట్‌ కొనుగోలు కోసం రూ.39.15 లక్షలు చెల్లించినా గడువులోగా స్వాధీనం ఇవ్వని బిల్డర్‌కు మహారాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (మహారెరా) షాక్ ఇచ్చింది. ప్రభుత్వ విభాగాల మధ్య అధికార పరిధి మార్పుల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందన్న బిల్డర్‌ వాదనను తిరస్కరించిన అథారిటీ.. ఆలస్యమైన కాలానికి కొనుగోలుదారుడికి వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.

పుణెలోని వాఘోలీ ప్రాంతంలో ప్రకాశ్‌ అనే వ్యక్తి ఓ ప్రాజెక్టులో ఫ్లాట్‌ కొనుగోలు చేశారు. 2022 సెప్టెంబర్‌ 12న బిల్డర్‌తో విక్రయ ఒప్పందం కుదిరింది. ఫ్లాట్‌ మొత్తం ధర రూ.41.85 లక్షలు కాగా.. కొనుగోలుదారుడు అప్పటికే రూ.39.15 లక్షలు చెల్లించారు. ఒప్పందం ప్రకారం 2024 డిసెంబర్‌ 31లోగా ఫ్లాట్‌ స్వాధీనం ఇవ్వాల్సి ఉంది. అయితే గడువు ముగిసినా ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ఆయన మహారెరాను ఆశ్రయించారు.

ఫ్లాట్‌ అప్పగింత ఆలస్యానికి పుణె మున్సిపల్‌ కార్పొరేషన్‌ (పీఎంసీ), పుణె మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎంఆర్డీఏ) మధ్య వాఘోలీ ప్రాంత అధికార పరిధిలో జరిగిన మార్పులే కారణమని బిల్డర్‌ వాదించాడు. కొత్త ప్లాన్లు, అనుమతులు తీసుకోవాల్సి రావడంతో నిర్మాణం ఆలస్యమైందని పేర్కొన్నాడు. అయితే కొనుగోలుదారుడు సమర్పించిన పత్రాలు ఈ వాదనను బలహీనపరిచాయి.

2021 జూన్‌ 30 నాటి ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం వాఘోలీ అప్పటికే పీఎంసీ పరిధిలోకి వచ్చింది. అంతేకాక ప్రాజెక్టులోని సీ-వింగ్‌ ప్లాన్‌కు 2022 జనవరిలోనే అనుమతి లభించింది. అంటే 2022 సెప్టెంబర్‌లో విక్రయ ఒప్పందం చేసుకునే సమయానికి బిల్డర్‌కు అధికార పరిధి అంశం గురించి అవగాహన ఉందని పత్రాలు సూచించాయి.

వీటిని పరిశీలించిన రెరా.. అవసరమైన అనుమతులు, ఆమోదాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ పొందడం బిల్డర్‌ బాధ్యత అని స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాల మధ్య మార్పులు జరిగాయని సాధారణంగా చెప్పడం మాత్రమే ఆలస్యాన్ని సమర్థించడానికి సరిపోదని పేర్కొంది. ఆ మార్పులు నిజంగా ఎంతకాలం ప్రాజెక్టును ప్రభావితం చేశాయి? నిర్మాణం పూర్తి కాకపోవడానికి అవే కారణమా? అనే అంశాలకు బిల్డర్‌ తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని తెలిపింది.

ముందే తెలిసిన అనుమతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని స్వాధీనం తేదీని నిర్ణయించాల్సిన బాధ్యత బిల్డర్‌దేనని పేర్కొంది. ఫ్లాట్‌ అంతర్గత పనులు పూర్తయ్యాయని, ఇంటీరియర్‌, ఫర్నిచర్‌ పనుల కోసం కొనుగోలుదారుడికి ప్రవేశం కల్పించామని బిల్డర్‌ మరో వాదన చేశాడు. దీనినీ మహారెరా అంగీకరించలేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ లేకుండా ఇచ్చే స్వాధీనం పూర్తిస్థాయి, చట్టబద్ధమైన స్వాధీనంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని చెప్పడం మాత్రమే సరిపోదని, చట్టబద్ధమైన OCతోనే ఫ్లాట్‌ అప్పగింత పూర్తయినట్లు పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో 2025 జనవరి 1 నుంచి చట్టబద్ధమైన స్వాధీనం అందించే వరకు కొనుగోలుదారుడు చెల్లించిన మొత్తంపై వడ్డీ చెల్లించాలని స్పష్టంచేసింది. కొనుగోలుదారుడు ఇంకా చెల్లించాల్సిన బకాయిలను ఈ వడ్డీ మొత్తంతో సర్దుబాటు చేసుకోవచ్చని కూడా ఆదేశించింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0