2031 నాటికి దేశంలో భారీగా మాల్స్‌ విస్తరణ

India’s retail real estate sector is set for significant mall expansion, with around 5.11 crore sq ft of new mall space expected by 2031, taking the total mall stock to 14.32 crore sq ft, according to JLL.

Oct 1, 2026 - 08:56
 0  10
2031 నాటికి దేశంలో భారీగా మాల్స్‌ విస్తరణ
india-mall-expansion-2031-retail-space

-      5.11 కోట్ల చదరపు అడుగుల కొత్త రిటైల్‌ స్పేస్‌

భారత్‌లో రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగం కొత్త దశలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఐదేళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ స్థాయిలో షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణం జరగనుంది. 2031 నాటికి సుమారు 5.11 కోట్ల చదరపు అడుగుల కొత్త మాల్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ JLL నివేదిక వెల్లడించింది.

దీంతో దేశంలోని మొత్తం షాపింగ్‌ మాల్‌ స్టాక్‌ 14.32 కోట్ల చదరపు అడుగులకు చేరనుంది. రాబోయే కొత్త మాల్‌ సరఫరాలో 56 శాతం అంటే దాదాపు 2.87 కోట్ల చదరపు అడుగులు పెద్ద ఫార్మాట్‌ మాల్స్‌ రూపంలో ఉండనున్నాయి. సాధారణంగా కేవలం షాపింగ్‌కు పరిమితం కాకుండా వినోదం, ఆహారం, సేవలు, అనుభవాత్మక కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇచ్చేలా వీటిని అభివృద్ధి చేయనున్నారు.

ఈ పెద్ద మాల్స్‌లో సుమారు 30–35 శాతం స్థలాన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌, సర్వీసుల కోసం కేటాయించే అవకాశం ఉంది. అంటే ఈ మూడు విభాగాలకే దాదాపు 90–100 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి రానుంది. దీంతో మాల్‌ అనేది కేవలం వస్తువులు కొనుగోలు చేసే ప్రదేశం కాకుండా కుటుంబాలు ఎక్కువ సమయం గడిపే ‘ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌’గా మారే ధోరణి బలపడనుంది.

ఢిల్లీ, హైదరాబాద్‌ కీలకం

కొత్తగా రాబోయే రిటైల్‌ స్పేస్‌లో సగానికి పైగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌లోనే వచ్చే అవకాశం ఉందని జేఎల్ఎల్ అంచనా వేసింది. దీంతో ఈ రెండు మార్కెట్లు దేశ రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ విస్తరణలో కీలకంగా మారనున్నాయి. 2026 తొలి అర్ధభాగంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 2.9 కోట్ల చదరపు అడుగుల ఆపరేషనల్‌ మాల్‌ స్టాక్‌ ఉంది. 2031 నాటికి ఇది 4.86 కోట్ల చదరపు అడుగులకు చేరుతుందని అంచనా.

బెంగళూరులో ప్రస్తుతం ఉన్న 1.44 కోట్ల చదరపు అడుగుల మాల్‌ స్టాక్‌ 2031 నాటికి 2.2 కోట్లకు, ముంబైలో 1.51 కోట్ల చదరపు అడుగుల నుంచి 2.16 కోట్ల చదరపు అడుగులకు పెరగవచ్చని JLL తెలిపింది. కొత్త మాల్స్‌ నిర్మాణానికి ప్రధాన కారణాల్లో వినియోగదారుల డిమాండ్‌, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశం, దేశీయ రిటైలర్ల విస్తరణ ఉన్నాయి. 2026 తొలి ఆరు నెలల్లో దేశంలోని టాప్‌-7 నగరాల్లో 6.27–6.3 మిలియన్‌ చదరపు అడుగుల రిటైల్‌ లీజింగ్‌ నమోదైంది.

ఇది 2025 తొలి అర్ధభాగంతో పోలిస్తే 10.5 శాతం పెరుగుదల. ఇదే సమయంలో మాల్‌ వేకెన్సీ 11.15 శాతానికి తగ్గింది. మాల్‌ స్పేస్‌పై రిటైలర్ల ఆసక్తి కూడా పెరుగుతోంది. 2026 తొలి అర్ధభాగంలో మొత్తం రిటైల్‌ లీజింగ్‌లో మాల్స్‌ వాటా 43.1 శాతానికి చేరింది. ఏడాది క్రితం ఇది 38.9 శాతంగా ఉంది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం లీజింగ్‌ 41.5 శాతం పెరగడం, వినియోగదారులు షాపింగ్‌తో పాటు వినోద అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని సూచిస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0