ఎంత న‌ష్టంతో భ‌య‌ట‌ప‌డ‌తాం.. అమ్మ‌కాల్లేక జుట్టుపీక్కుంటున్న కొంద‌రు బిల్డ‌ర్లు!

Hyderabad’s real estate market is witnessing an unusual situation where some completed projects still have a significant number of unsold flats, leaving even established builders under financial pressure.

Sep 30, 2026 - 00:00
 0  150
ఎంత న‌ష్టంతో భ‌య‌ట‌ప‌డ‌తాం.. అమ్మ‌కాల్లేక జుట్టుపీక్కుంటున్న కొంద‌రు బిల్డ‌ర్లు!
hyderabad-builders-unsold-flats-completed-projects
  • పూర్త‌యిన ప్రాజెక్టుల్లో అమ్ముడుకాని ఫ్లాట్లు
  • రెడీ టు ఆక్యుపైని ఎంచుకోని బయ్య‌ర్లు
  • న‌గ‌ర రియాల్టీలో విచిత్ర ప‌రిస్థితులు..

హైద‌రాబాద్‌లో కొన్ని ప్రాజెక్టులు పూర్త‌య్యాయి.. ఫ్లాట్ల‌ను బ‌య్య‌ర్ల‌కు బిల్డ‌ర్లు హ్యాండోవ‌ర్ చేశారు.. అందులోని స‌దుపాయ‌ల్ని కొన్న‌వారు కూడా ఆస్వాదిస్తున్నారు.. కానీ, కొంద‌రు బిల్డ‌ర్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. రోజూ బీపీలు, షుగ‌ర్‌లు పెరుగుతున్నాయి.. హార్ట్‌బీట్ అధిక‌మ‌వుతోంది.. కారణం.. ఇంకా, అందులో అమ్ముడుకాని ఫ్లాట్లు అనేకం ఉండ‌ట‌మే. బ‌య‌టికేమో బ‌య్య‌ర్లు గృహ‌ప్ర‌వేశ సంబురాల్ని జ‌రుపుకుంటుంటే.. బిల్డ‌ర్లేమో మిగ‌తావాటిని ఎలా అమ్ముకోవాలో తెలియ‌క త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నారు. 

బెంగ‌ళూరు, చెన్నై, ముంబై బిల్డ‌ర్లు హైద‌రాబాద్‌లో కోట్ల రూపాయ‌ల విలువ గ‌ల ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తుంటే.. కొంద‌రు న‌గ‌ర బిల్డ‌ర్లేమో.. హ్యాండోవ‌ర్‌కు సిద్ధ‌మైన ఫ్లాట్ల‌ను అమ్ముకోలేక నానా తంటాలు ప‌డుతున్నారు. కేవ‌లం చిన్నాచిత‌కా బిల్డ‌ర్లే కాదు.. బ‌డా బిల్డ‌ర్లు సైతం ఇదే త‌ర‌హా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. మ‌రి, ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క్క ఏం చేయాలో త‌ల‌ప‌ట్టుకుంటున్నారు.

లాభాల మాట దేవుడెరుగు ఎంత శాతం న‌ష్టాల‌తో ప్రాజెక్టులో నుంచి బ‌య‌ట‌ప‌డ‌తామో తెలియ‌క కొంద‌రు బిల్డ‌ర్లు జుట్టుపీక్కుంటున్నారు. మ‌రికొంద‌రేమో ఉందిలే మంచికాలం ముందు ముందు.. అంటూ కాలం వెళ్ల‌దీస్తున్నారు. ఇంకొంద‌రు బిల్డ‌ర్లు ఈ ప్ర‌భుత్వం ఉన్నంత‌వ‌ర‌కూ ఎలాంటి ప్రాజెక్టుల్ని చేయ‌కూడ‌ద‌నే నిర్ణ‌యం తీసుకుని.. ఎంచ‌క్కా విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో స‌మ‌యాన్ని గ‌డిపేస్తున్నారు. 

తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో కూడా లేని ప్ర‌తికూల ప‌రిస్థితులు.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఎందుకు నెల‌కొన్నాయంటే.. అనేక కార‌ణాల్ని విశ్లేషించొచ్చు. ముందుగా, కొంద‌రు బిల్డ‌ర్లు 2018 నుంచి 2023 దాకా త‌మ తాహ‌తును మించి.. ఎక్కువ ప్రాజెక్టుల్ని ఆరంభించారు. అలాంటివారిలో సింహ‌భాగం ప్ర‌స్తుతం స‌మ‌స్యల సుడిగుండంలో చిక్కుకున్నారు.

అక్క‌డా ఇక్క‌డా అప్పులు చేస్తూ.. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌ల నుంచి రుణాల్ని తీసుకుంటూ.. ఆశించినంత స్థాయిలో అమ్మ‌కాలు లేకున్నా.. నిర్మాణ ప‌నుల్ని జ‌రిపిస్తున్నారు. బ్లాకుల వారీగా ఫ్లాట్ల‌ను విక్ర‌యించిన కొంద‌రు.. ప‌లు ట‌వ‌ర్ల‌లో ఫ్లాట్ల‌ను కొన్న వారిని ఒకట్రెండు ట‌వ‌ర్ల కిందికి తెస్తున్నారు. త‌ప్ప‌ద‌న్న‌ట్లు నిర్మాణ‌ ప‌నుల్ని చేప‌డుతున్నారు. ఈ ఒప్పందానికి అంగీక‌రించ‌ని వారికి.. వారు చెల్లించిన సొమ్ము వెన‌క్కి ఇచ్చేందుకు అంగీక‌రిస్తున్నారు. ఆయా బ‌య్య‌ర్ల‌ను ఆఫీసుల చుట్టూ తిప్పిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0