ఫ్యూచర్‌సిటీకి వాటర్ సెక్యూరిటీ..
The Telangana government is considering an alternative water supply plan for Bharat Future City, with a proposal to bring water from the Uddandapur Reservoir, part of the Palamuru-Rangareddy Lift Irrigation Scheme.
సౌత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు బూస్ట్?
ఫ్యూచర్ సిటీకి వాటర్ ప్లాన్..
ఉద్ధండాపూర్ నుంచి నీటి సరఫరా ప్రతిపాదన..
చందన్‌వెల్లి, సీతారాంపూర్, షాద్‌నగర్
కారిడార్‌పై పెరుగుతున్న అంచనాలు
భారత్ ఫ్యూచర్‌సిటీ అభివృద్ధిలో అత్యంత కీలకమైన నీటి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి ఫ్యూచర్‌సిటీకి నీటిని తరలించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనిపై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులు నివేదిక సమర్పించగా, తుది నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రారంభంలో ఫ్యూచర్‌సిటీతో పాటు చందన్‌వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక ప్రాంతాలకు హిమాయత్‌సాగర్ నుంచి నీటిని తరలించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే హైదరాబాద్ నగర భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదని సమాచారం. హిమాయత్‌సాగర్ నీటిని నగరానికే పరిమితం చేయాలని నిర్ణయించడంతో ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ఆధారంగా కొత్త ప్రణాళిక రూపొందింది.
రియల్ ఎస్టేట్‌కు కొత్త సంకేతాలు
రియల్ ఎస్టేట్ రంగంలో మౌలిక సదుపాయాలే పెట్టుబడులకు ప్రధాన ప్రమాణంగా భావిస్తారు. ముఖ్యంగా రహదారులు, మెట్రో, విద్యుత్‌తో పాటు దీర్ఘకాలిక నీటి లభ్యత కూడా భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీల అభివృద్ధికి కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి శాశ్వత నీటి వనరు ఖరారైతే దక్షిణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు అదనపు ఊతం లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ప్రాంతాలపై పెరుగుతున్న దృష్టి
ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ఉద్ధండాపూర్ నుంచి వచ్చే నీటితో ఫ్యూచర్‌సిటీతో పాటు చందన్‌వెల్లి, సీతారాంపూర్ పారిశ్రామిక ప్రాంతాలు, షాద్‌నగర్, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని 1,331 గ్రామాలు, 9 పట్టణ స్థానిక సంస్థలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అదనంగా సింగూరు, వట్టెం, సంగంబండ, కరివెన వంటి రిజర్వాయర్ల ద్వారా కూడా ప్రాంతాల వారీగా కొత్త నీటి పంపిణీ వ్యవస్థను రూపొందించాలని అధికారులు ప్రతిపాదించారు.
పరిశ్రమలకు, హౌసింగ్‌కు అనుకూలం
ఫ్యూచర్‌సిటీని ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన తయారీ పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరహా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత అత్యంత కీలక అంశం. అందువల్ల నీటి సరఫరాపై స్పష్టత వస్తే పరిశ్రమలతో పాటు నివాస ప్రాజెక్టులు, టౌన్‌షిప్‌లు, వాణిజ్య అభివృద్ధి కూడా వేగం పుంజుకునే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు భావిస్తున్నారు.
తుది నిర్ణయంపై ఆసక్తి
ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనికి ఆమోదం లభిస్తే ఫ్యూచర్‌సిటీ అభివృద్ధికి మరో కీలక మౌలిక సదుపాయం జతకానుంది. అదే సమయంలో దక్షిణ హైదరాబాద్‌లో ఇప్పటికే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఇది మరో సానుకూల సంకేతంగా మారే అవకాశముందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0