దుబాయ్‌లో చిన్న ఇళ్లకు భారీ డిమాండ్‌

Dubai South recorded 12,428 residential property transactions between January and August 2026, already 27% higher than the 9,788 transactions recorded during the whole of 2025, according to ANAROCK.

Oct 27, 2026 - 08:26
Oct 28, 2026 - 06:22
 0  83
దుబాయ్‌లో చిన్న ఇళ్లకు భారీ డిమాండ్‌
దుబాయ్‌లో చిన్న ఇళ్లకు భారీ డిమాండ్‌.
  • 8 నెలల్లోనే రికార్డు అమ్మకాలు

యూఏఈలోని దుబాయ్‌ సౌత్‌ ప్రాంతంలో చిన్న ఇళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. స్టూడియో అపార్ట్‌మెంట్లు, ఒక బెడ్‌రూమ్‌ ఇళ్ల కొనుగోళ్లు గణనీయంగా పెరగడంతో 2026 జనవరి–ఆగస్టు మధ్య నివాస గృహాల లావాదేవీలు 12,428కు చేరాయి. ఇది 2025లో ఏడాది మొత్తంలో నమోదైన 9,788 లావాదేవీల కంటే 27 శాతం ఎక్కువ.

అనరాక్‌ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో జరిగిన మొత్తం గృహ లావాదేవీల్లో స్టూడియో అపార్ట్‌మెంట్ల వాటా 45 శాతంగా ఉంది. 2025లో ఇది 19.5 శాతమే.

ఒక బెడ్‌రూమ్‌ ఇళ్ల వాటా మరో 31 శాతంగా నమోదైంది. దీంతో ఈ రెండు రకాల ఇళ్ల వాటా కలిపి 76 శాతానికి చేరింది. కొనుగోలుదారులు తక్కువ మొత్తం పెట్టుబడితో కొనుగోలు చేయగలిగే ఇళ్లవైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక పేర్కొంది.

ఇదీ చదవండి: ఫ్యూచర్‌ సిటీకి మరింత విస్తరణ

చదరపు అడుగు ధర పెరిగినా..

2026 జనవరి–ఆగస్టు మధ్య దుబాయ్‌ సౌత్‌లో గృహ విక్రయాల విలువ 15.9 బిలియన్‌ దిర్హామ్‌లకు (సుమారు రూ.41,117 కోట్లు) చేరింది. 2025లో నమోదైన 19.6 బిలియన్‌ దిర్హామ్‌ల అమ్మకాల విలువలో ఇది 81 శాతానికి సమానం.

ఇక్కడ చదరపు అడుగు సగటు ధర 2020లో 650 దిర్హామ్‌లు ఉండగా, 2026 తొలి ఎనిమిది నెలల్లో 1,656 దిర్హామ్‌లకు పెరిగింది. అయితే, ఒక ఇంటి సగటు కొనుగోలు విలువ 2023లోని 2.57 మిలియన్‌ దిర్హామ్‌ల గరిష్ఠ స్థాయి నుంచి 1.28 మిలియన్‌ దిర్హామ్‌లకు (సుమారు రూ.3.31 కోట్లు) తగ్గింది.

చిన్న ఇళ్ల విక్రయాలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని అనరాక్‌ వివరించింది. దీన్ని మొత్తం మార్కెట్‌లో ధరలు పడిపోయినట్లుగా భావించకూడదని స్పష్టం చేసింది.

మౌలిక సదుపాయాలతో మరింత ఊతం

దుబాయ్‌ సౌత్‌ 145 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ప్రణాళికాబద్ధ నగరం. అల్‌ మక్తూమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ విస్తరిస్తున్న ఈ ప్రాంతంలో నివాస, లాజిస్టిక్స్‌, విమానయాన, వ్యాపార తదితర రంగాలకు ప్రాధాన్యం ఉంది.

పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత సుమారు 10 లక్షల మంది నివాసానికి, 5 లక్షల ఉద్యోగాలకు అనుగుణంగా ఈ నగరాన్ని రూపొందిస్తున్నారు. 2027–2029 మధ్య ఇక్కడ 38,116 ఇళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు ఉన్నాయి.

ముఖ్యంగా 2028లో 16,094 ఇళ్ల అప్పగింతలు ఉండొచ్చని నివేదిక అంచనా వేసింది. రాబోయే సంవత్సరాల్లో భారీగా ఇళ్ల సరఫరా పెరగనున్న నేపథ్యంలో, ఆ ఇళ్లకు తగినంత కొనుగోలుదారుల డిమాండ్‌ కొనసాగడం కీలకమని అనరాక్‌ అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: అమ్మకాలు తగ్గుతున్నా.. ఫ్లాట్ల ధరలు తగ్గేదెప్పుడు?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0