హుస్సేన్ సాగర్ చుట్టూ ఎఫ్‌టీఎల్‌లో కూల్చివేత‌లు ఉంటాయా?

The issue of construction within the Full Tank Level (FTL) limits of Hussain Sagar Lake has once again sparked discussion in Hyderabad’s real estate sector after GHMC issued a show-cause notice to the Pradeep Constructions high-rise residential project on Raj Bhavan Road, Somajiguda.

Aug 23, 2026 - 03:04
 0  97
హుస్సేన్ సాగర్ చుట్టూ ఎఫ్‌టీఎల్‌లో కూల్చివేత‌లు ఉంటాయా?
Will There Be Demolitions Within the FTL Around Hussain Sagar?

హైదరాబాద్ లోని హుస్సేన్‌ సాగర్ సరస్సు పూర్తి నీటి మట్టం- ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాల అంశం మరోసారి హైద‌రాబాద్‌ రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులో ప్రదీప్ సంస్థ‌ చేపట్టిన బహుళ అంతస్తుల నివాస ప్రాజెక్టుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్- జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఉన్న ఇతర నిర్మాణాల పరిస్థితిపైనా చర్చ మొదలైంది. 

హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలు హైదరాబాద్‌లో అత్యంత విలువైన వాణిజ్య, పర్యాటక, నివాస ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, సోమాజిగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో ది పార్క్ హైదరాబాద్, హైదరాబాద్ మారియట్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్, కోర్ట్‌యార్డ్ బై మారియట్, ఐటీసీ కాకతీయ వంటి ప్రముఖ హోటళ్లు, అలాగే అనేక కార్యాలయ సముదాయాలు, వ్యాపార భవనాలు, నివాస సముదాయాలు ఉన్నాయి. ఇవన్నీ సరస్సుకు అత్యంత సమీపంలో ఉండటంతో సహజంగానే ప్రజల్లో ఆసక్తి నెలకొంటోంది.

సమీపంలో ఉండటం ఒకటి-ఎఫ్‌టీఎల్‌లో ఉండటం మరోటి

అయితే హుస్సేన్ సాగర్ కు సమీపంలో ఉన్న ప్రతి భవనం ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని భావించడం సరైంది కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక నిర్మాణం పూర్తి నీటి మట్టం పరిధిలో ఉందా? బఫర్ జోన్‌లో ఉందా? లేక చట్టబద్ధమైన భూమిపైనా ఉందా? అనే విషయాన్ని ఇరిగేషన్ శాఖ రూపొందించిన అధికారిక ఎఫ్‌టీఎల్ మ్యాపులు, సర్వే రికార్డులు, రెవెన్యూ పత్రాల ఆధారంగానే నిర్ధారిస్తారు. ప్రస్తుతం ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టు మినహా ఇతర నిర్మాణాలపై అధికారికంగా ఎలాంటి ఉల్లంఘనలు ప్రకటించకపోయినా అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు అధికారిక వర్గాలు సమాచారం.

పరిశీలనలు మరింత విస్తరిస్తాయా?

ప్రస్తుతం జరుగుతున్న చర్యల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లోని ఇతర నిర్మాణాల అనుమతులు, భూ రికార్డులు, ఎఫ్‌టీఎల్ మ్యాపులను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉందన్న చర్చ రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ పరిశీలనలను విస్తరిస్తే మరికొన్ని నిర్మాణాలకు కూడా వివరణ కోరే నోటీసులు జారీ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం గానీ, సంబంధిత శాఖలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0