అనంతపురంలో కిమ్స్ సేవేరా ఆస్ప‌త్రి విస్త‌ర‌ణ 

KIMS Seveera Hospital in Anantapur expands from 250 to 500 beds, adding advanced cancer treatment facilities and a dedicated Mother and Child Care Centre to strengthen healthcare services in Rayalaseema.

Oct 30, 2026 - 12:13
Oct 31, 2026 - 03:13
 0  11
అనంతపురంలో కిమ్స్ సేవేరా ఆస్ప‌త్రి విస్త‌ర‌ణ 
కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కరరావు.
  • 500 పడకలతో కొత్త వైద్య సేవలు ప్రారంభం
  • రాయలసీమకు మరింత మెరుగైన వైద్యం..
  • కిమ్స్ సేవేరా ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స, తల్లీబిడ్డల కేంద్రం!

అనంతపురంలోని కిమ్స్ సేవేరా ఆసుపత్రి వైద్య సేవలను భారీగా విస్తరించింది. ఇప్పటివరకు 250 పడకల సామర్థ్యంతో ఉన్న ఈ ఆసుపత్రిని 500 పడకలకు పెంచింది. ఈ విస్తరణతో రాయలసీమ ప్రజలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

తాజా విస్తరణతో కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ మొత్తం పడకల సంఖ్య 9,117కు చేరింది. విస్తరించిన ఆసుపత్రిని నవంబర్ 1, 2026న ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ హాజరుకానున్నారు.

కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కరరావు మాట్లాడుతూ.. క్యాన్సర్ చికిత్స, తల్లీబిడ్డల సంరక్షణ సేవలను బలోపేతం చేయడం ద్వారా.. రాయలసీమ ప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఇదీ చదవండి: కోకాపేటలో కొత్త‌గా..  గ్రీన్‌ వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0