అడ్డంగా ఇరుక్కుపోయిన  ప్రీలాంచ్ బ‌య్య‌ర్లు...

Homebuyers who purchased flats in pre-launch projects three or four years ago to get lower prices are now facing uncertainty due to the slowdown in Hyderabad’s real-estate market.

Aug 24, 2026 - 23:09
 0  14
అడ్డంగా ఇరుక్కుపోయిన  ప్రీలాంచ్ బ‌య్య‌ర్లు...
Pre-Launch Buyers Trapped in Uncertainty…
రేటు త‌క్కువ‌కు వ‌స్తుంద‌ని మూడు, నాలుగేళ్ల క్రితం ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను కొన్న బ‌య్య‌ర్లు అడ్డంగా ఇరుక్కుపోయారు. ఎందుకంటే, మార్కెట్లో నెల‌కొన్న ప్ర‌తికూల ప‌రిస్థితుల కార‌ణంగా.. కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు అనుకున్నంత స్పీడుగా అపార్టుమెంట్ల‌ను నిర్మించ‌డం లేదు. మ‌రికొంద‌రేమో అట్ట‌హాసంగా మూడు నాలుగు ట‌వ‌ర్లకు సంబంధించిన నిర్మాణ ప‌నుల్ని ప్రారంభించినా.. వాటిని ఏక‌కాలంలో నిర్మించ‌లేక చేతులెత్తేస్తున్నారు. కొనుగోలుదారులు నిల‌దీస్తుండ‌టంతో.. రెండు, మూడు ట‌వ‌ర్ల‌కు చెందిన బ‌య్య‌ర్ల‌ను ఒకే ట‌వ‌ర్లోకి స‌ర్దుబాటు చేస్తున్నారు. 
ఈ ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రించ‌క‌పోతే, మ‌రో ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల‌ను స‌ర్దుబాటు చేస్తున్నారు. లేదంటే, వారు చెల్లించిన సొమ్ముతో వ‌డ్డీతో స‌హా.. కొంత‌కాలం అయ్యాక ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ముంద‌స్తు చెక్కుల‌ను సైతం బ‌య్య‌ర్ల‌కు కొంద‌రు బిల్డ‌ర్లు అంద‌జేస్తున్నారు. అయితే, మార్కెట్లో ప‌రిస్థితి ఇలాగే ప్ర‌తికూలంగా నెల‌కొంటే.. ఆయా ఒక్క ట‌వ‌ర్ కూడా పూర్త‌వుతుందా లేదా అనే సందేహాంలో ప్రీలాంచ్ బ‌య్య‌ర్లు కొట్టిమిట్టాడుతున్నారు. 
 
నీర‌సంలో వెండార్లు!
కొంద‌రు బిల్డ‌ర్లు అయితే వెండార్ల‌కు పేమెంట్లు చెల్లించ‌కుండా చేతులెత్తేస్తున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాకుండా త‌ల‌బాదుకుంటున్నారు. ఫ‌లితంగా కొంద‌రు ఆయా సంస్థ‌కు నిర్మాణ సామ‌గ్రిని స‌ర‌ఫ‌రా చేయ‌కుండా నిలిపిస్తున్నారు. ముంద‌స్తుగా న‌గదు చెల్లించేవారికే స‌రుకును పంపిస్తున్నారు. మ‌రికొంద‌రు వెండార్లు తెలివిగా ఏం చేస్తున్నారంటే.. బిల్డ‌ర్లు చేయాల్సిన చెల్లింపుల్ని ఆల‌స్యం చేస్తే.. ఆయా సొమ్ముపై వ‌డ్డీని వ‌సూలు చేస్తున్నారు.
దీంతో, ఏం చేయాలో అర్థం కాక‌, బిల్డ‌ర్లు కూడా అందుకే స‌రేన‌ని అంగీక‌రిస్తున్నారు. మార్కెట్ మెరుగ్గా ఉన్నంత వ‌ర‌కూ.. బిల్డ‌ర్ల నుంచి ఠంచ‌నుగా సొమ్ము తీసుకునే వెండార్లు.. మార్కెట్లో ప్ర‌తికూల ప‌రిస్థితి ఏర్ప‌డ‌గానే స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్నారు. మొత్తానికి, అమ్మ‌కాల్లేక‌పోవ‌డంతో అటు బిల్డ‌ర్లు ఇటు వెండార్ల‌లో ఎక్క‌డ్లేని నీర‌సం నెల‌కొంది. ఈ ప‌రిస్థితి ఎప్పుడు మారుతుందోన‌ని హైద‌రాబాద్ నిర్మాణ రంగం ఆస‌క్తితో ఎదురు చూస్తోంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0