కొంపల్లిలో ‘భారతి లేక్ వ్యూ’ హోమ్బయ్యర్లకు భారీ ఊరట
The Telangana Real Estate Regulatory Authority (TG-RERA) has ordered a full refund with 10.70% annual interest to 12 homebuyers who paid money for flats in the Bharathi Lake View project at Kompally, but faced delays as construction never began.
- 12 మందికి డబ్బులు వాపస్ చేయాలని రెరా ఆదేశం
కొంపల్లిలో తలపెట్టిన భారతి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్టులో ఇళ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు చెల్లించి, నిర్మాణం ప్రారంభం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది హోమ్బయ్యర్లకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) ఊరటనిచ్చింది. కొనుగోలుదారులు చెల్లించిన మొత్తం మొత్తాన్ని 10.7 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ రిఫండ్‌ను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రమోటర్, భాగస్వాములు, తదుపరి భూక్రేతలకు స్పష్టం చేసింది.
మెడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లి గ్రామ పరిధిలో లేక్ వ్యూ టవర్స్‌గా తొలుత పేర్కొన్న ప్రాజెక్టును అనంతరం భారతి లేక్ వ్యూగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. 2021లో పలువురు కొనుగోలుదారులు డెవలపర్‌తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఒప్పందాల ప్రకారం ఫ్లాట్లను 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో ఆరు నెలల గ్రేస్ పీరియడ్ ఉంటుందని కొనుగోలుదారులకు హామీ ఇచ్చారు.
అయితే గడువు ముగిసినా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో వారు రెరాను ఆశ్రయించారు. పైగా ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు పొందకపోవడంతోపాటు, రెరా రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. నిర్మాణ పనులు ప్రారంభం కాకముందే ప్రాజెక్టుకు సంబంధించిన భూమిలో గణనీయమైన భాగం ఇతరులకు విక్రయించబడిందని కూడా వారు ఆరోపించారు.
దీంతో తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని 12 మంది హోమ్బయ్యర్లు రెరాను కోరారు. ఈ వ్యవహారంపై 12 ఫిర్యాదులను పరిశీలించిన టీజీ రెరా.. ఆగస్టు 25, 2026న రెండు ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేసింది. కొనుగోలుదారులకు పూర్తి రిఫండ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రమోటర్, ప్రాజెక్టుతో సంబంధం ఉన్న భాగస్వాములు, అనంతరం భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు సంయుక్తంగా, విడివిడిగా బాధ్యత వహిస్తూ రీఫండ్ చెల్లించాలని పేర్కొంది. మొత్తం ప్రక్రియను 60 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0