ఎంఎంటీఎస్ విస్తరణ.. రియాల్టీకి ఎంత లాభం?
Hyderabad’s rapidly expanding western corridor could see a major transformation if MMTS connectivity is extended to emerging residential and IT hubs such as Tellapur, Kollur, Patancheru, Bhanur and Shankarpally.
పశ్చిమ హైదరాబాద్‌లో పెరుగుతున్న ఆవాసాలు
ఎంఎంటీఎస్ విస్తరణకు డిమాండ్
రామచంద్రాపురం-పటాన్‌చెరు లైన్ పునరుద్ధరణపై ఆశలు
5.75 కి.మీ. సింగిల్ లైన్ డబ్లింగ్ ప్రతిపాదన
తెల్లాపూర్-శంకర్‌పల్లి కొత్త లైన్‌కు డిమాండ్
కొల్లూరు, నాగులపల్లి, కొండకల్, భానూర్‌లో స్టేషన్ల ప్రతిపాదన
మదీనాగూడలో కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్ డిమాండ్
కొల్లూరు స్టేషన్‌కు అదనపు సదుపాయాల ప్రతిపాదన
భరత్‌నగర్‌కు మరో ప్రవేశ ద్వారం డిమాండ్
ఉందానగర్-శంషాబాద్ ఎయిర్‌పోర్టు లైన్ పెండింగ్
ప్రస్తుతం 86 ఎంఎంటీఎస్ రైళ్లు
రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులు
ఎంఎంటీఎస్ విస్తరణతో రియల్ ఎస్టేట్‌కు బూస్ట్?
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం.. ఒకప్పుడు నగర శివారు. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు, భారీ అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీలతో ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తెల్లాపూర్, కొల్లూరు, పటాన్‌చెరు, భానూర్, శంకర్‌పల్లి వరకు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నా.. అందుకు తగ్గట్టుగా ప్రజా రవాణా మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలంటే.. పశ్చిమ హైదరాబాద్‌కు ఎంఎంటీఎస్ కనెక్టివిటీని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ పెరుగుతోంది. పటాన్‌చెరు నుంచి శంకర్‌పల్లి వరకు కొత్త లైన్లు, కొత్త స్టేషన్లు వస్తే.. ఈ ప్రాంతాల ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే కాదు.. రియల్ ఎస్టేట్ మ్యాప్ కూడా మారే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ఐటీ కారిడార్ విస్తరణతో పాటు నివాస ప్రాంతాలు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. తెల్లాపూర్, కొల్లూరు, నల్లగండ్ల, పటాన్‌చెరు, భానూర్, శంకర్‌పల్లి ప్రాంతాల్లో భారీగా గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే వారి సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. అయితే ఉద్యోగ కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువగా రోడ్డు రవాణాపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్రాపురం–పటాన్‌చెరు మధ్య ఉన్న పాత రైల్వే మార్గాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలన్న డిమాండ్ కీలకంగా మారింది. తెల్లాపూర్-రామచంద్రాపురం-పటాన్‌చెరు మార్గంలో సుమారు 5.75 కిలోమీటర్ల సింగిల్ లైన్‌ను డబుల్ లైన్‌గా మారిస్తే.. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచేందుకు అవకాశం ఉంటుంది. పటాన్‌చెరులో ఆధునిక ఎంఎంటీఎస్ స్టేషన్ ఏర్పాటు చేస్తే.. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం కలగనుంది.
ఇక పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్ రవాణా అవసరాలకు కీలకంగా మారే మరో ప్రతిపాదన.. తెల్లాపూర్ నుంచి శంకర్‌పల్లి వైపు ఎంఎంటీఎస్ లైన్ విస్తరణ. కొల్లూరు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్, నాగులపల్లి, కొండకల్, భానూర్ క్రాస్‌రోడ్స్, శంకర్‌పల్లి ప్రాంతాల్లో స్టేషన్లు ఏర్పాటు చేస్తే.. ప్రస్తుతం రోడ్డు మార్గంపైనే ఆధారపడుతున్న వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయ ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుంది. మదీనాగూడలోనూ కొత్త ఎంఎంటీఎస్ స్టేషన్ కోసం డిమాండ్ ఉంది. చందానగర్–హఫీజ్‌పేట్ మధ్య దూరం ఎక్కువగా ఉండటం.. మదీనాగూడ పరిసరాల్లో జనాభా భారీగా పెరగడం ఇందుకు కారణం. మరోవైపు కొల్లూరు వైపు కొత్త ప్లాట్‌ఫాం, స్టేషన్ సదుపాయాలు, అదనపు ప్రవేశ మార్గాలు ఏర్పాటైతే.. ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలకు రైలు ప్రయాణం మరింత చేరువయ్యే అవకాశం ఉంది.
ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కూడా మరో కీలక అంశం. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ ఫేజ్-2లో పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు సుమారు 6 కిలోమీటర్ల లైన్ విస్తరణ మాత్రం భూసేకరణ వంటి అంశాలతో ముందుకు సాగాల్సి ఉంది. ఈ మార్గం పూర్తయితే నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు తక్కువ ఖర్చుతో ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్‌లో సుమారు 86 రైళ్లు నడుస్తుండగా.. రోజుకు దాదాపు 50 వేల మంది ప్రయాణికులు సేవలను వినియోగిస్తున్నారు.
గతంలో 120 వరకు రైళ్లు నడిచిన నేపథ్యంలో.. సేవల సంఖ్య పెంచడంతో పాటు కొత్త ప్రాంతాలకు నెట్‌వర్క్‌ను విస్తరించాలన్న డిమాండ్ ఉంది. ఎంఎంటీఎస్ విస్తరణ జరిగితే ప్రయోజనం కేవలం ట్రాఫిక్ తగ్గడానికే పరిమితం కాదు. రైలు స్టేషన్ల చుట్టూ నివాస, కమర్షియల్ అభివృద్ధి వేగం పుంజుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెల్లాపూర్, కొల్లూరు, భానూర్, శంకర్‌పల్లి, పటాన్‌చెరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్‌కు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. అంటే.. పశ్చిమ హైదరాబాద్‌లో రోడ్లు, మెట్రోతో పాటు ఎంఎంటీఎస్ కూడా బలపడితే.. ట్రాఫిక్ తగ్గడంతో పాటు రియల్ ఎస్టేట్ మ్యాప్ కూడా మరోసారి మారే ఛాన్స్ కనిపిస్తోంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0