సైబర్ సిటీ ట్రెవిటా: కొండాపూర్‌లో లగ్జరీ గృహాలకు కొత్త చిరునామా
Cybercity Trevita launches its experience centre in Kondapur, Hyderabad, featuring luxury 3 and 4 BHK residences, a 60,000 sq. ft. clubhouse, 75% green spaces and smart security systems.
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ తన అల్ట్రా లగ్జరీ నివాస ప్రాజెక్ట్ ‘సైబర్ సిటీ ట్రెవిటా’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ‘ట్రూ లగ్జరీ’ థీమ్‌తో రూపొందించిన ఈ ప్రాజెక్టులో ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారు నివాసాల డిజైన్, సదుపాయాలు, జీవనశైలి ప్రత్యేకతలను నేరుగా తెలుసుకోవచ్చు.
ట్రెవిటాలో 3, 4 బీహెచ్‌కే విలాసవంతమైన నివాసాలను నిర్మిస్తున్నారు. ప్రతి ఇంటికి సుమారు 37 అడుగుల పొడవైన ప్రత్యేక అవుట్‌డోర్ లివింగ్ డెక్ ఉండటం ప్రత్యేకత. ప్రాజెక్టులో 75 శాతం స్థలాన్ని పచ్చదనం, ఖాళీ ప్రదేశాల కోసం కేటాయించారు. మొత్తం 37 ల్యాండ్‌స్కేప్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో ఐదు అంతస్తుల్లో విస్తరించిన 60,000 చదరపు అడుగుల క్లబ్‌హౌస్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో క్రీడలు, వినోదం, విశ్రాంతి కోసం వివిధ సదుపాయాలు ఉంటాయి. రూఫ్‌టాప్‌పై 35 సదుపాయాలతో స్కైలైన్ డెక్, టెర్రస్ స్విమ్మింగ్ పూల్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
ట్రెవిటాలో ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి టవర్ ప్రవేశ లాబీలో బయోమెట్రిక్ భద్రతతో కూడిన బీమా కలిగిన ‘ఔర్మ్ వాల్ట్స్’ లాకర్లను ఏర్పాటు చేస్తున్నారు. నివాసితుల విలువైన వస్తువులను భద్రంగా ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి.
అలాగే ఎలివేట్ బై ఆరమ్ పేరిట రోబోటిక్ పార్శిల్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు. ప్రత్యేక లిఫ్ట్ ద్వారా పార్శిళ్లను చేర వేయడం వల్ల డెలివరీ సిబ్బంది నివాస ప్రాంతాల్లోకి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. దీంతో నివాసితుల గోప్యతకు రక్షణ లభించడంతో పాటు సాధారణ లిఫ్ట్‌లపై ఒత్తిడి తగ్గుతుంది.
సైబర్ సిటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక డిజైన్, సాంకేతికత, పచ్చదనాన్ని కలిపి కొనుగోలుదారులకు మెరుగైన జీవన అనుభూతిని అందించడమే ట్రెవిటా లక్ష్యమని తెలిపారు. కొండాపూర్‌లో ఈ ప్రాజెక్టు విలాసవంతమైన ఇళ్లను కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షించేలా రూపొందుతోంది.
ఇదీ చదవండి: నాలుగు గోడలు కాదు.. మెరుగైన జీవనశైలిని అందిస్తున్నాం: శ్రీవర్ధన్ రెడ్డి
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0