ఫాంహౌస్‌లో తెలంగాణ రియల్టర్ రాంరెడ్డి ఆత్మహత్య
Hyderabad-based realtor and Home Land head Banala Ram Reddy died by suicide at his farmhouse in Nedunur, Kandukur mandal, Ranga Reddy district
హైదరాబాద్‌లో హోమ్ ల్యాండ్ అధినేత బాణాల రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులోని ఆయన ఫాంహౌస్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాంరెడ్డి పటాన్‌చెరులో 280 ఎకరాల్లో కొత్త వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక నేతలు, పలువురి ఒత్తిడితో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
280 ఎకరాల వెంచర్ వివాదం
రాంరెడ్డి గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని మణికొండలో నివాసముంటున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్ కోసం తీసుకుని వెంచర్ చేపట్టారు. అయితే ఆ భూమికి సంబంధించిన వివాదాలు, లిటిగేషన్లతో వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్లు సమాచారం. ఆ వివాదాలను పరిష్కరించేందుకు భారీగా అప్పులు చేసినట్లు, మరోవైపు భూ యజమానులతో కూడా సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. వెంచర్ ఆలస్యం కావడంతో ఆర్థిక భారం పెరిగి ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం.
రాంరెడ్డి రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్‌ను కందుకూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. రాంరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాంరెడ్డి ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0