కూక‌ట్‌పల్లి.. ప్రీలాంచ్ స్కామ్‌కు అడ్డా!

The report warns homebuyers to exercise extreme caution while investing in pre-launch apartment projects in Kukatpally, where some developers may be using pre-launch collections to fund their existing projects.

Aug 26, 2026 - 03:46
 0  4
కూక‌ట్‌పల్లి.. ప్రీలాంచ్ స్కామ్‌కు అడ్డా!
kukatpally-prelaunch-flats-scam-homebuyer-alert
  • రేటు త‌క్కువ‌ని కొంటే.. అంతే సంగ‌తులు
  • సొంతింటి క‌ల పీడ‌క‌లగా మారుతుంది! 
  • ఇక్క‌డి ప్రీలాంచ్‌లో పెట్టుబ‌డి పెడితే.. 
  • వేరే ప్రాజెక్టుల‌కు నిధుల్ని మ‌ళ్లిస్తారు.. 
  • త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. మీ సొమ్ముకు మీదే బాధ్య‌త‌

త‌క్కువ రేటుకు వ‌స్తుంద‌ని మీరు ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేస్తే అంతే సంగ‌తులు. మీ సొంతింట్లోకి అడుగుపెట్టేందుకు ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూస్తారు. దీంతో పాటు పోలీసు స్టేష‌న్లు, కోర్టుల చుట్టూ తిర‌గాల్సిన దుస్థితి ఏర్ప‌డుతుంది. అప్పుడు మిమ్మ‌ల్ని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వం కూడా ముందుకు రాక‌పోవ‌చ్చు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తుందంటే.. అధిక శాతం నిర్మాణ సంస్థ‌ల‌న్నీ గ‌త మూడు, నాలుగేళ్ల‌లో త‌మ స్థాయికి మించికెళ్లి.. ఎక్క‌డ స్థ‌లం దొరికితే అక్క‌డ అపార్టుమెంట్ల‌ను ఆరంభించాయి.

గ‌త రెండున్న‌రేళ్ల నుంచి ఫ్లాట్ల అమ్మ‌కాలు జ‌ర‌గ‌ట్లేదు. దీంతో, నిర్మాణ ప‌నుల‌న్నీ మంద‌గించాయి. మ‌రోవైపు ఫ్లాట్లను కొన్న‌వారి నుంచి బిల్డ‌ర్ల మీద ఒత్తిడి పెరుగుతోంది. దీంతో, ఏం చేయాలో అర్థం కాకుండా, కొంద‌రేం చేస్తున్నారంటే.. కొత్త ప్రాంతాల్లో ప్రీలాంచ్‌లో ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తున్నారు. అందులో ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను అమ్ముతున్నారు. బ‌య్య‌ర్లు ఇచ్చే సొమ్మును తీసుకెళ్లి.. ప్ర‌స్తుతం నిర్మాణం జ‌రుపుకుంటున్న ప్రాజెక్టుల్లో వాడుతున్నారు. అంటే, వాటిని పూర్తి చేయ‌డానికి ప్రీలాంచ్‌లో కొన్న బ‌య్య‌ర్ల సొమ్మును వాడుతున్నారు.

అంటే, ఇప్పుడు ప్రీలాంచ్ ప్రాజెక్టును ఎలాగైనా ఏడాదికో రెండేళ్ల‌కో ఆరంభిస్తారు. కాబ‌ట్టి, అప్ప‌టివ‌ర‌కూ ఇదేవిధంగా ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను అమ్ముతూనే ఉంటారు. ఇలాగే కూక‌ట్ ప‌ల్లిలో ఒక నిర్మాణ సంస్థ ఏం చేసిందంటే.. బూమ్ స‌మ‌యంలో న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ఎడాపెడా ఆకాశ‌హ‌ర్మ్యాల్ని ఆరంభించింది. ఇప్పుడేమో నిర్మాణ ప‌నుల్ని పూర్తి చేయ‌డానికి నిధుల్లేక‌పోవ‌డంతో.. కూక‌ట్‌ప‌ల్లిలో ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తోంది. ఇక మ‌రో సంస్థ అయితే, ఇదే ప్రాంతంలో ఒక‌ట్రెండేళ్ల నుంచి ప్రీలాంచ్లో ఫ్లాట్ల‌ను అమ్ముతూనే ఉంది. అందుకే, మేం చెప్పేదేమిటంటే.. ప్రీలాంచ్‌లో త‌క్కువ‌కు వ‌చ్చినా.. మీ సొమ్మును అందులో పెట్టుబ‌డిగా పెట్ట‌కండి. చెప్పిన స‌మ‌యానికి నాణ్య‌త‌తో ప్రాజెక్టును పూర్తి చేసే బిల్డ‌ర్ల వ‌ద్ద మాత్ర‌మే ఫ్లాట్ల‌ను ఎంచుకోండి. ఇలాంటి ప్రీలాంచ్ మోస‌గాళ్ల బారిన ఎట్టిప‌రిస్తితిలో ప‌డ‌కండి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0