కోల్‌కతాకు పూర్వ వైభవం తెస్తాం
West Bengal Finance Minister Swapan Dasgupta said efforts are underway to restore Kolkata’s prominence and transform it into a modern city suited to the needs of the 21st century.
* ఆర్థిక మంత్రి స్వపన్‌దాస్ గుప్తా
* అట్టహాసంగా ఆరంభమైన క్రెడాయ్ న్యాట్‌కాన్ 2026
* సదస్సుకి హాజరైన పన్నెండు వేల మంది బిల్డర్లు
(కింగ్ జాన్సన్ కొయ్యడ, కోల్‌కతా)
గత యాభై ఏళ్ల నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వృద్ధులంతా వెళ్లిపోయారని.. ఇప్పుడు నవయువకులతో ఈ నగరాన్ని మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్ గుప్తా తెలిపారు. కోల్‌కతాలోని ఐటీసీ రాయల్ బెంగాల్ హోటల్‌లో ఆరంభమైన క్రెడాయ్ నాట్‌కాన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధునిక నగరంగా కోల్‌కతాను అభివృద్ధి చేసేందుకు గల అన్ని అవకాశాల్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
21వ శతాబ్దానికి అనుగుణంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాల్ని ముమ్మరం చేశామన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ మాట్లాడుతూ.. 2047 నాటికి సుమారు 55 కోట్ల మంది నగరాల్లో నివసిస్తారని వెల్లడించారు. సుమారు పదకొండు కోట్ల గృహాల్ని నిర్మించాల్సి వచ్చినప్పుడు ఆధునిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో ఒడిదొడుకులు సహజమేనని.. సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని అవకాశాలుగా మార్చుకోవాలన్నారు.
ఈ సందర్భంగా క్రెడాయ్ ఛైర్మన్ బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. సింగపూర్ తరహా అభివృద్ధి చెందడానికి కోల్‌కతాకు పూర్తి అవకాశముందన్నారు. కోల్‌కతాను రీ డెవలప్ చేయడంలో క్రెడాయ్ ముఖ్య భూమికను పోషిస్తుందన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ (ఎలక్ట్) గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో అనేక సమస్యలు ఎదురవుతున్నా.. బయ్యర్లకు మెరుగైన గృహాల్ని అందజేయడానికి దేశవ్యాప్తంగా తమ సభ్యులు విశేషంగా కృషి చేస్తున్నామని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ (ఎలక్ట్) జి గుమ్మి రాంరెడ్డి తెలిపారు.
1999లో వంద మందితో ఆరంభమైన క్రెడాయ్ సంఘంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదమూడు వేల మంది సభ్యులున్నారని అన్నారు. దేశీయ నిర్మాణ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం క్రెడాయ్ డెవలపర్లలో పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి, జాతీయ సంఘ సభ్యులతో పాటు వివిధ నగరాలకు చెందిన క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0