14 ఏళ్ల నిరీక్షణకు తెర.. యమునా సిటీ ఫ్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట
The National Consumer Disputes Redressal Commission (NCDRC) has directed Sunworld Vandita Group to refund the money paid by flat buyers in Greater Noida’s Yamuna City Sector-22D, along with 12% interest.
గ్రేటర్ నోయిడాలోని యమునా సిటీ సెక్టార్-22డీలో ఫ్లాట్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొనుగోలుదారులకు జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్ సీడీఆర్సీ) భారీ ఊరటనిచ్చింది. సన్‌వరల్డ్ వందితా గ్రూప్ నుంచి ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి వారు చెల్లించిన మొత్తాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలి. గడువులోగా చెల్లించకపోతే వడ్డీ రేటు 15 శాతానికి పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి కొనుగోలుదారుడికి రూ.25 వేల చొప్పున న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.
యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ 2011లో సెక్టార్-22డీలో సన్‌వరల్డ్ వందితా గ్రూప్‌కు భూమిని కేటాయించింది. 2012లో సంస్థ ప్రాజెక్టును ప్రారంభించి ఫ్లాట్ల బుకింగ్స్ చేపట్టింది. సుమారు 1,400 మంది కొనుగోలుదారులు ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు. 2013 నాటికి చాలామంది కొనుగోలుదారులు ఫ్లాట్ విలువలో 20 నుంచి 80 శాతం వరకు చెల్లించారు. బిల్డర్-బయ్యర్ ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఫ్లాట్ల నిర్మాణం ముందుకు సాగలేదు. 2017లో కొందరు కొనుగోలుదారులు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించగా అక్కడ నిర్మాణ పనులు ప్రారంభమైన ఆనవాళ్లు కూడా కనిపించలేదు.
దీంతో వారు 2018లో ఎన్ సీడీఆర్సీని ఆశ్రయించారు. తాము చెల్లించిన మొత్తం మొత్తాన్ని 24 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వడంతో పాటు మానసిక వేదనకు రూ.2 లక్షలు, న్యాయపరమైన ఖర్చులకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని కోరారు. అయితే, ప్రాజెక్టు ఆలస్యానికి తమను బాధ్యులను చేయలేమని బిల్డర్ వాదించాడు. భూమికి సంబంధించి రైతులు కోర్టులను ఆశ్రయించడం, రైతుల ఆందోళనలు, పలు న్యాయపరమైన వివాదాల కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయని నివేదించాడు. అయితే ఈ వాదనను కమిషన్ అంగీకరించలేదు. ప్రాజెక్టును ప్రచారం చేసి కొనుగోలుదారుల నుంచి డబ్బులు స్వీకరించిన తర్వాత అవసరమైన అనుమతులు, నిబంధనల అమలు, ఇతర అనుసరణలను నిర్ధారించడం బిల్డర్ బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది. వెంటనే వారు చెల్లించిన మొత్తాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని స్పష్టంచేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0